ముగిసిన ఒలింపియాడ్ పరీక్ష
నారాయణపేట రూరల్: పట్టణంలోని శ్రీసాయి పాఠశాలలో మంగళవారం సుచరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీవీ రామన్ ఒలింపియాడ్ పరీక్ష నిర్వహించారు. 6 నుండి 10వ తరగతి వరకు మొత్తం 93 మంది విద్యార్థులు మ్యాథ్స్, సైన్స్ పోటీ పరీక్షలో పాల్గొన్నారు. పరీక్షలో పాల్గొనడంతో గురుకుల, ఎంసెట్, నీట్ తదితర పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో ముందస్తుగా పాఠశాల స్థాయిలోనే తెలుస్తుందని పాఠశాల కరస్పాండెంట్ సాయిలీల తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు యాంగ్ జీనియస్ అవార్డ్స్ హైదరాబాద్లో అందజేస్తారని చెప్పారు. పరీక్షలను ప్రిన్సిపాల్ బాలప్ప, అమీనా, నర్సింహ, శివ అమర్, మనీల, వనిత పర్యవేక్షించారు.
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 విభాగం బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పీడీ, స్పోర్ట్స్ ఇన్‌చార్జి వేణుగోపాల్ మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సాదత్‌ఖాన్, బాల్‌రాజు, సీనియర్ క్రీడాకారులు సయ్యద్ ఎజాజ్‌అలీ, ఎండీ ఉస్మాన్ పాల్గొన్నారు.
నేటి నుంచి
ధనుర్మాస ఉత్సవాలు
అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో వెలసిన శ్రీయోగా నరసింహస్వామి ఆలయంలో బుధవారం నుంచి ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దీప్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా రోజు ఉదయం 4:30 గంటలకు సుప్రభాత సేవ, 5 గంటలకు తిరుప్పావై పఠనం, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనాలు, విష్ణు సహస్త్రనామార్చన, కుంకుమార్చన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 14న శ్రీ భూనీలా సమేత యోగా నరసింహస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక
గోపాల్‌పేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని స్వరూప ఎస్జీఎఫ్ అండర్–17 జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై ందని పాఠశాల పీడీ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగే ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొననునట్లు చెప్పారు. నవంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్‌కీపర్‌గా అత్యంత ప్రతిభ కనబర్చినందుకుగాను ఎంపిక చేసినట్లు వివరించారు. గతంలో ఎస్జీఎఫ్ క్రీడల్లో మూడుసార్లు పాల్గొని ప్రతిభ కనబర్చిందని, కల్వకుర్తిలో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి టోర్నీ, మధ్యప్రదేశ్‌లో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్‌కీపర్‌గా అవార్డు సాధించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిని ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.
ముగిసిన ఒలింపియాడ్ పరీక్ష


