1,650
సర్పంచ్ స్థానాలు
పోటీలో ఉన్నవారు
● ఉమ్మడి జిల్లాలో ‘తొలి’ పోరు ఇలా..
● వార్డులు 3,691..
బరిలో నిలిచిన వారు 9,127
● మొత్తంగా 58 సర్పంచ్,
1,147 వార్డులు ఏకగ్రీవం
● 2 వార్డు స్థానాల్లో దాఖలు కాని
నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 1,678 గ్రామాలు, 15,077 వార్డులు ఉన్నాయి. తొలి విడత షెడ్యూల్ ప్రకారం 550 గ్రామాలు, 4,840 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే 58 జీపీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 492 సర్పంచ్ పదవులకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు 1,650 మంది బరిలో నిలిచారు. అదేవిధంగా మొదటి విడతలో పోలింగ్ జరగనున్న వార్డు స్థానాల్లో 1,147 ఏకగ్రీవమయ్యాయి. ఇవి పోనూ 3,691 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. 9,127 మంది పోటీలో నిలిచారు.
గద్వాల, వనపర్తిలో పోటాపోటీ..
తొలి దశ జీపీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున ముగ్గురు పోటీపడుతున్నారు. పాలమూరులోని ఐదు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండగా.. ప్రధానంగా గద్వాల, వనపర్తిలో పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు రెబల్స్‌గా బరిలో ఉన్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు చెందిన బలమైన నాయకులు సైతం పోటీలో నిలవడం ఆసక్తికరంగా మారింది.
● తొలి విడత ఎన్నికలకు సంబంధించి నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలో వాల్యానాయక్ తండాలో ఆరో వార్డుకు ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. ఆ అభ్యర్థి సర్పంచ్ స్థానానికి కూడా నామినేషన్ వేశారు. ఆయన సర్పంచ్‌గా ఏకగ్రీవం కాగా.. ఆరో వార్డు కు వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. అదేవిధంగా వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం ఏదుట్ల గ్రామంలో ఏడో వార్డుకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
తొలి విడతలో ఎన్నికల వివరాలు..
జిల్లా జీపీలు ఏకగ్రీవం పోలింగ్ బరిలో వార్డులు ఏకగ్రీవం పోలింగ్ బరిలో
సర్పంచ్ జరిగేవి ఉన్నవారు జరిగేవి ఉన్నవారు
మహబూబ్‌నగర్ 139 10 129 425 1,188 264 924 2,195
నాగర్‌కర్నూల్ 151 14 137 447 1,326 208 1,118 2,774
జోగుళాంబ గద్వాల 106 15 91 321 974 361 613 1,425
నారాయణపేట 67 14 53 170 572 210 361 1,017
వనపర్తి 87 05 82 287 780 104 675 1,716
మొత్తం 550 58 492 1,650 4,840 1,147 3,691 9,127


