తొలి పరీక్ష..!
మహబూబ్‌నగర్ : సమన్వయంతో ప్రచారం..
వనపర్తి, పేటలో..
నాగర్‌కర్నూల్: ఎవరికి వారే..
డీసీసీ చీఫ్‌లకు ‘పంచాయతీ’ సవాల్
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా పోటీచేసిన వారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాం. రెబల్‌గా వేసిన అభ్యర్థులను బుజ్జగిస్తున్నాం. విడతల వారీగా కొనసాగుతున్న ఎన్నికల్లో కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో పర్యటిస్తాం.
– కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి,
డీసీసీ అధ్యక్షుడు, నారాయణపేట
జిల్లాలోని మూడు నియోజకవర్గాల నేతలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచార పోరు కొనసాగిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తోంది. మెజార్టీ పంచాయతీల్లో సర్పంచ్ వార్డు స్థానాలను కై వసం చేసుకుంటామనే నమ్మకం ఉంది.
– సంజీవ్ ముదిరాజ్,
డీసీసీ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్
● మెజార్టీ జీపీల్లో గెలుపే మొదటి టాస్క్
● నేతల మధ్య సమన్వయమే
ప్రధాన సమస్య
● పలు నియోజకవర్గాల్లో
ప్రచారానికి దూరంగా అసంతృప్త
నేతలు
● పట్టించుకోని అధిష్టానం తీరుతో
అలక
● అందరినీ ఒక్కతాటిపైకి
తెచ్చి కాంగ్రెస్ సత్తా
చాటుతామంటున్న నూతన
అధ్యక్షుల ధీమా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నూతనంగా ఎన్నికై న అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు పంచాయతీ పోరు సవాల్ విసురుతోంది. డీసీసీ చీఫ్‌లుగా నియామకమైన వెంటనే ఎన్నికలకు తెరలేవడం.. వారి సత్తాకు పరీక్షగా మారింది. మెజార్టీ పంచాయతీల్లో గెలుపే వారి తొలి టాస్క్ కాగా.. క్షేత్రస్థాయిలో సంగ్రామం బాట పట్టారు. పలు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో గ్రూప్‌లు.. అంటీముట్టనట్లుగా ఉన్న నేతలతో వారికి సమన్వయం కత్తిమీద సాములా మారినట్లు తెలుస్తోంది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ సరిత భర్త తిరుపతయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాజీవ్‌రెడ్డి, నల్లారెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి ఆశించారు. అధిష్టానం రాజీవ్‌రెడ్డికి అవకాశం కల్పించింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పలు గ్రామాల్లో పార్టీ మద్దతుదారులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. గద్వాల మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఇదివరకే డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపాటుకి గురైన సరిత వర్గం.. తాజాగా ఎమ్మెల్యేతో కలిసి రాజీవ్‌రెడ్డి ప్రచారంలో పాల్గొనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ జిల్లాలో పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులకు అటు సరిత, ఇటు బండ్ల వర్గానికి చెందిన మద్దతుదారుల మధ్యే పోరు నడుస్తోంది. ఈ క్రమంలో రాజీవ్‌రెడ్డి.. ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేయడంపై సరిత వర్గం గుర్రుగా ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు మళ్లీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరికి వారు పంచాయతీ ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ తన సొంత నియోజకవర్గం అచ్చంపేటకే పరిమితమయ్యారు.
రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో పంచాయతీ పోరు హీటెక్కింది. అటు బీఆర్‌ఎస్ ఇటు బీజేపీ ఏకమై మెజార్టీ గ్రామాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలకు సంబంధించిన వర్గాలు సైతం పోరులో నిలిచాయి.
ప్రధానంగా వనపర్తి, గద్వాలలో చేతులు కలవని పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. డీసీసీ పీఠం ఆశించి భంగపడడం ఒకవైపు కాగా.. భర్తీ తరువాత అధిష్టానం కనీసం సంప్రదింపులు చేయకపోవడం, బుజ్జగించకపోవడం అసంతృప్త నేతలను మరింత నారాజ్‌లోకి నెట్టినట్లు సమాచారం.
నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పునర్నియామకమైన కె.ప్రశాంత్‌రెడ్డి కూడా జీపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆ జిల్లా పరిధిలోని నారాయణపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి.. మక్తల్‌లో మంత్రి వాకిటి శ్రీహరి అన్నీ తామై తమ పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం రూపొందించిన వ్యూహాలను అమలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్‌గా బరిలో నిలిచిన వారిని పోటీ నుంచి విరమింపజేసేలా ప్రశాంత్‌కుమార్‌రెడ్డి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన సంజీవ్ ముదిరాజ్ పంచాయితీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నుంచి డీసీసీ పీఠాన్ని అధిరోహించాలని ఆశలతో ఉన్న వారిని సైతం కలుసుకొని సహకరించాలని కోరారు. ఆ వెంటనే జీపీ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ మహబూబ్‌నగర్ రూరల్ మండల పరిధిలో రెండు రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమైన శివసేనారెడ్డి పంచాయతీ ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్పో ర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. నూతనంగా డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై న క్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలోనే పంచాయతీ ఎన్నికల తంతు కొనసాగుతుందని చెప్పారు.
తొలి పరీక్ష..!
తొలి పరీక్ష..!
తొలి పరీక్ష..!
తొలి పరీక్ష..!
తొలి పరీక్ష..!
తొలి పరీక్ష..!


