బెల్ట్ షాపులపై దాడులు
మహబూబ్‌నగర్ క్రైం: ‘కోడ్ ఉన్నా బెల్ట్ జోరు’ అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి ఎకై ్సజ్ శాఖ అధికారులు స్పించారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కృష్ణా మండల పరిధిలోని హిందూపూర్‌లో నిర్వహిస్తున్న బెల్ట్ దుకాణంపై దాడులు చేసి సిద్దప్ప అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 7.72 లీటర్ల మద్యం సీజ్ చేయగా బస్వరాజ్ అనే వ్యక్తి ఇంట్లో ఆరు లీటర్ల మద్యం సీజ్ చేయడంతో పాటు ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ అనంతయ్య వెల్లడించారు. నారాయణపేట ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో ఊట్కూర్ మండలం పులిమామిడిలో సోదాలు చేసి 2.52 లీటర్ల మద్యం సీజ్ చేశారు. జడ్చర్ల సర్కిల్ పరిధిలో రాజాపూర్‌లో 7.8 లీటర్ల బీరు, 0.550 లీటర్ల మద్యం, కావేరమ్మపేటలో లిక్కర్ 24.050 లీటర్లు, బీర్ 14.345 లీటర్లు పట్టుకున్నారు. గెగ్యా తండాలో రెండు లీటర్ల నాటుసారా సైతం సీజ్ చేశారు.
నాలుగు మండలాల్లో
నిషేధాజ్ఞలు అమలు
నారాయణపేట: ఈ నెల 11వ తేదీన (గురువారం) జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికారులకు కలెక్టర్ సిక్తాపట్నాయక్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలి విడత ఎన్నికలు జరిగే కోస్గి, కొత్తపల్లి, గుండుమల్, మద్దూరు నాలుగు మండలాల పరిధిలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎలాంటి ప్రచారం చేపట్టరాదన్నారు. అలాగే, బహిరంగ ప్రచారానికి అనుమతి ఉండదని తెలిపారు. ఎన్నికల సజావుగా నిర్వహణకు ఇప్పటికే నాలుగు మండలాల్లో నిషేధాజ్ఞలు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి అమలులోకి వస్తాయని, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధం అన్నారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. పోలింగ్ డిసెంబర్ 11వ తేదీ, గురువారం ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించబడుతుందని చెప్పారు. పోలింగ్ ముగిసిన అనంతరం, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు,ఫలితాల వెల్లడి జరుగుతుందని ఆమె తెలిపారు.
క్వింటా ఆర్‌ఎన్‌ఆర్ రూ.2,839
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 6 వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. 5,700 క్వింటాళ్ల ధాన్యం రాగా.. ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాలు గరిష్టంగా రూ.2,829, కనిష్టంగా రూ.1,674 ధరలు లభించాయి. హంస రకానికి గరిష్టంగా రూ.1,866, కనిష్టంగా రూ.1,625, చిట్టి ముత్యాలు రూ.3,016, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,972, కనిష్టంగా రూ.1,950 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,659, కనిష్టంగా రూ.2,309 ధర వచ్చింది. కాగా.. బుధవారం ఉదయం మార్కెట్‌లో ఉల్లిపాయల బహిరంగవేలం నిర్వహించనున్నారు.
కనులపండువగా
కల్పవృక్ష వాహనసేవ
మక్తల్: పడమటి ఆంజనేయస్వామి ఉత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆలయంలో కల్పవృక్ష వాహనసేవా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి విగ్రహాలను పూలతో అలంకరించిన రథంపై ఉంచి.. హనుమాన్ నామస్మరణల నడుమ భక్తులు ఆలయం చుట్టూ రథాన్ని లాగారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ ప్రణేష్‌కుమార్, ఈఓ కవిత, పూజరి ప్రాణేష్‌చారి, అరవింద్ పాల్గొన్నారు.
బెల్ట్ షాపులపై దాడులు
బెల్ట్ షాపులపై దాడులు


