రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
నారాయణపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా సోమవారం కలెక్టరేట్ లో మూడో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండ వ ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి సమక్షంలో చేపట్టారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరి స్తూ చేపట్టిన ర్యాండమైజేషన్ ప్రక్రియను వారు నిశితంగా ప రిశీలించారు. జిల్లాలోని మండలాల వారీగా గ్రామ పంచాయ తీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధులకు ఎంపిక చేశారు. మొత్తం 110 గ్రామ పంచాయతీల సర్పంచ్, 994 వార్డుల స్థానాల్లో 994 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ కోసం 20శాతం రిజర్వు స్టాఫ్‌తో కలుపుకొని ప్రిసైడింగ్ అధికారులతో పాటు ఓపీఓల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్డీవో మొగులప్ప, డీపీఓ సుధాకర్‌రెడ్డి, డీపీఆర్‌ఓ రషీద్ పాల్గొన్నారు.
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి


