టోకెన్ల విధానంపై ప్రత్యేక దృష్టి ఏదీ
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు మద్యం పంపిణీ చేయడానికి టోకెన్ల విధానం వాడుతుంటారు. ఈ ఎన్నికల్లో టోకెన్ల విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి మద్యం దుకాణంపై నిఘా ఏర్పాటు చేసి ఎవరైనా ఈ విధానం అమలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు బాల్క్‌గా సేల్స్ ఉండరాదు. ఇళ్లలో, పాత భవనాలలో మద్యం నిల్వలు ఉంటే తనిఖీలు చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో వీటిపై ఆశించినస్థాయిలో నిఘా కానీ సోదాలు కనిపించడం లేదు. గ్రామాల్లో చిన్నచిన్న కిరాణ దుకాణాలు బార్లను తలపిస్తున్నాయి. అన్ని పార్టీలు బహిరంగంగానే మద్యం తరలిస్తున్నా.. మద్యం అమ్మకాలు భారీస్థాయిలో జరగాలనే ఉద్దేశంతో సదరుశాఖ అధికారులు నామమాత్రపు చర్యలకే పరిమితం అవుతున్నట్లు తెలుస్తోంది.


