ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
నారాయణపేట: జిల్లాలో మూడో విడత జరిగే మక్త ల్, ఊట్కూర్, నర్వ, మాగనూరు, కృష్ణా మండలా ల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. నామినేషన్ల ఉపసంహరణ, ఏకగ్రీవ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ జారీ, వినియోగం తదితర అంశాలపై సోమవారం కలెక్టరేట్‌లో పోస్టల్ బ్యాలె ట్ నోడల్ అధికారులు, స్టేజ్–1, స్టేజ్–2 రిటర్నింగ్, జోనల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నా యక్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరిగినా తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందన్నారు. అత్యంత శ్ర ద్ధతో, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. మూడో విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను మంగళవారం మధ్యా హ్నం 3 గంటలలోగా పూర్తిచేయాలని ఆదేశించా రు. ఇప్పటికే సింగిల్ నామినేషన్ దాఖలైన సర్పంచ్, వార్డు స్థానాల ఫలితాలను జిల్లా ఎన్నికల అధి కారి ఎన్‌ఓసీ ఇచ్చిన తర్వాత ప్రకటించాలని సూ చించారు. అదే విధంగా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత కూడా ఒకే సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉంటే.. నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులతో డిక్లరేషన్ తీసుకొని ఎన్నికల నియమ నిబంధనల మేరకు ఏకగ్రీవమైనట్లు ప్రకటించాలన్నారు.ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తిచేసి తహ సీల్దార్లకు సమాచారం అందించాలని తెలిపారు. ఎన్నికల పోలింగ్‌కు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. రక్షణ దళాల్లో పనిచేస్తున్న సర్వీ స్ ఓటర్ల పోస్టల్ బ్యాలెట్లు తప్పనిసరిగా పంపించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ప్రీవెంటివ్ డిటెన్షన్ ఓటరు పోస్టల్ బ్యాలెట్ జారీ చేసేందుకు ఫారం–14ద్వారా ముందస్తు న మోదు తప్పనిసరి అని ఆయన స్పష్టంచేశారు. ఫా రం–14 సమర్పించిన వారికే పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా పనిచేయాలని.. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల అ ధికారులు డీఆర్డీఓ మొగులప్ప, డీఏఓ జాన్ సుధాకర్, డీపీఓ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


