వందలాది ఎకరాల్లో నష్టం..
ప్రస్తుతం కట్ట వెలుపలి భాగంలో రిజర్వాయర్ చుట్టూ రైతులు వేలాది ఎకరాల్లో మక్కలు, పత్తి, వరి, కూరగాయలు సాగు చేస్తున్నారు. వర్షాలకు కట్ట కోతకు గురై మట్టి మొత్తం పొలాల్లోకి చేరడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పత్తి వేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం పత్తి ఏరేదశలో ఉండగా.. నీళ్లు, మట్టి చేరడంతో దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. ఈ మేరకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చే స్తున్నారు. దీంతోపాటు రిజర్వాయర్ కట్ట పనుల్లో నాణ్యత పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో ఇప్పటికే సర్వం కోల్పోయామని.. ఇంకా పరిహా రం అందనే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ నీటి లీకేజీ, మట్టి, ఇసుక మేటలతో నష్టం వాటిల్లుతున్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. కాగా రిజర్వాయర్ కట్టకు కోత, నీటి లీకేజీపై పీఆర్‌ఎల్‌ఐ అధికారులను ఫోన్‌లో సంప్రదించేందుందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. ఎవరూ అందుబాటులోకి రాలేదు.


