నష్టపరిహారం అందించాలి..
ఇటీవల కురిసిన వర్షాలకు రిజర్వాయర్ కట్ట ఎక్కడికక్కడ కోతకు గురైంది. పలు చోట్ల కట్ట లీకవుతుండడంతోపాటు కట్ట కోతకు గురై వరద మా పంట పొలాలను ముంచెత్తింది. మట్టి మేటలు వేయడంతో నేను నాలుగు ఎకరాల్లో వేసిన వరి దెబ్బతింది. రిజర్వాయర్ కాంట్రాక్టర్లతో మాకు నష్టపరిహారం ఇప్పించాలి.
– వెంకటేష్, కిష్టారం, జడ్చర్ల, మహబూబ్‌నగర్
వరి చేనును మట్టి కమ్మేసింది
ఉదండాపూర్ రిజర్వాయర్ కట్ట తెగిపోవడంతో వరద నీరు మా పొలంలోకి వచ్చింది. ఎకర పొలంలో సాగు చేసిన వరి చేనుపై మట్టి దిబ్బలు పేరుకుపోయి మాకు తీవ్ర నష్టం జరిగింది. సంబంధిత అధికారులను ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కట్ట తెగిన ప్రతిసారి మా పొలాల్లోకి మట్టి కొట్టుకు వస్తుంది. పంటలు నష్టపోతున్నాం. మాకు జరిగిన పంట నష్టానికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– గడ్డల రమేష్, రైతు, కిష్టారం
నష్టపరిహారం అందించాలి..


