మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి
నారాయణపేట టౌన్: స్వయం సహాయక మహిళా సంఘాలకు ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని మున్సిపల్ కమిషనర్ నర్సయ్య అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నెలవారీ పొదుపు, రుణాల ఆడిట్‌పై చర్చించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. మహిళా సంఘాల సభ్యులకు అందించే రుణాలతో వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా బలపడాలని సూచించారు. అదే విధంగా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. సమావేశంలో పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సాయికుమారి, కార్యదర్శి ఉమా, కోశాధికారి జరీనా తదితరులు ఉన్నారు.
రోడ్డు విస్తరణతో
నష్టం లేకుండా చూడాలి
మద్దూరు: పట్టణంలోని పాతబస్టాండ్ నుంచి గురుకుల పాఠశాల వరకు 70 ఫీట్ల మేర రోడ్డు విస్తరణ కోసం మార్కింగ్ వేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేశారు. రోడ్డు విస్తరణతో ఎవరికీ నష్టం వాటిల్లకుండా 30 ఫీట్ల మేరకు మాత్రమే విస్తరించాలని మంగళవారం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్‌కు విన్నవించారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ.. గతంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను ఉత్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిని అంత తక్కువగా కాకుండా.. ఓ నిర్ధిష్టంగా అందరికీ ఆమోదయోగ్యంగా, రాకపోకలకు అనుకూలంగా ఉండే విధంగా విస్తరించే అవకాశం ఉందన్నారు. బాధితులు కూడా దీనిపై ఓ అంగీకారానికి వచ్చి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కాగా, రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందించాలని బాధితులు కోరారు. కార్యక్రమంలో రోడ్డు విస్తరణ బాధితులు అంబర్‌నాథ్, శ్రీనివాస్, ముస్తాక్, నర్సింహ, నర్సింహులు, షబ్బీర్, మైనొద్దీన్, సిద్దిలింగం, సిద్దు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి


