మద్దతు ధరలు పెంచరు..
రైతులు ఆరుగాలం శ్ర మించి మట్టిలో పోరాడి పండించిన పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేక వ్యాపారు లు చెప్పిన ధరకే అమ్ముకొని వస్తున్నాం. ఎరువుల ధరలు పెంచుతున్న కంపెనీలు, ప్రభుత్వాలు పంటల మద్దతు ధరలు మాత్రం పెంచడం లేదు. ఏటా ఎరువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పంటల ధరలు పెంచే వరకు రైతుల కష్టాలు తీరవు.
– తిరుపతయ్య, మరికల్
ధరలు నియంత్రణలో ఉండాలి..
వానాకాలంలో బస్తా ఎరువుపై రూ.50 పెంచారు. మళ్లీ యాసంగిలో కూడా రూ.50 పెంచుతామని కంపెనీలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎరువుల కంపెనీలకు రైతుల కష్టాలు కనిపించడం లేదు. ఎరువుల ధరల పెంపు కేంద్రం నియంత్రణలో ఉంటేనే రైతులకు తక్కువ ధరకు లభిస్తాయి.
– వెంకటేష్, జిన్నారం
●
మద్దతు ధరలు పెంచరు..


