
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
మక్తల్: అంగన్‌వాడీ సమస్యల పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని సోమ వారం ముట్టడించారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్లు, అయాలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌తోపాటు విద్యను నిర్వీర్యం చేస్తుందని, నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని తెచ్చిందని అన్నా రు. ప్రీప్రైమరీ, పీఎంశ్రీ విద్య పేరుతో ఐదేళ్లలోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ప్రీప్రైమరీ పీఎం శ్రీవిద్య నడపాలని డిమాండ్ చేశారు. అలాగే, 24 రోజులు సమ్మె వేతనం వెంటనే చెల్లించాలని, పెంచిన రిటైర్మెంట్ బెన్‌ఫిట్ 2024 జూలై 1 నుంచి చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమస్యలపై క్యాబినెట్‌లో చర్చిస్తానని, వినతిపత్రంలో పేర్కొన్న అంశాలపై సీఎంతో చర్చిస్తానన్నారు. ఇంటి ముట్టడి కార్యక్ర మం వద్దని, మీరు మీ తమ్ముడు, మీ అన్న ఇంటికి వచ్చారని, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని లబ్ధిదారులు అందరికీ అందేలా చూస్తానన్నారు.నాయకులు ఆంజనేయులు, గోవిందురాజు, రమే ష్, మంజుల, విజయలక్ష్మి, రాధిక, గిరిజ పాల్గొన్నారు.