
‘ప్రజావాణి’కి 44 ఫిర్యాదులు
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 44 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎస్ శ్రీను,ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
చట్ట ప్రకారం పరిష్కరించాలి
పోలీస్ గ్రీవెన్స్‌కు వచ్చిన ఫిర్యాదులను చట్ట ప్రకారం వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 15 ఫిర్యాదులు రాగా ఎస్పీ పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచరాదని ఫోన్‌లో ఎస్పీ సూచించారు.