
జాతీయ ఆయుర్వేద కాన్ఫరెన్స్‌కు జిల్లా వైద్యులు
నారాయణపేట రూరల్: విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ ఆయుర్వేద కాన్ఫరెన్స్‌లో ఎనిమిది మంది జిల్లా వైద్యులు పాల్గొన్నారు. వ్యాప్ కాన్ –2025 సదస్సులో భాగంగా యూసఫ్‌గూడలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నిమ్స్ మే లో రెండు రోజుల పాటు వర్క్ షాష్‌లో ఆయుర్వేద వైద్యంపై విసృత అవగాహన కల్పించారు. యోగా, న్యాచురోపతి ద్వారా వైద్య సేవలు అందించే విధానంపై శిక్షణ ఇచ్చారు. చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి వేల ఏళ్ల క్రితం నాటి గ్రంథాల ఉపయోగాలను వివరించారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆస్పత్రుల నిర్మాణం జరగనుందని తెలిపారు. సెమినార్‌లో జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్ విరోజ, మల్లికార్జున్, వినోద్, అనురాధ, భవాని, సుమన, చందన, శ్రుతి తదితరులు పాల్గొన్నారు.