
ఆర్థిక తోడ్పాటు..
మాది పేద కుటుంబం. మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నా. గతేడాది ఉపాధ్యాయుల సహకారంతో ఎన్‌ఎంఎంఎస్ శిక్షణ తీసుకొని ఉత్తీర్ణత సాధించా. ఏటా ప్రభుత్వం ఇచ్చే పారితోషికం నా చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది. మా నాన్నకు భారం తగ్గింది.
– చైతన్య, విద్యార్థి, షేర్నపల్లి
పిల్లలకు తర్ఫీదునిస్తున్నాం..
పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపకార వేతనం ఎంతో ప్రయోజనం. ప్రణాళికతో చదివితే విజయం సాధించవచ్చు. అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులకు సంబంధిత ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టుల్లో మెళకువలు నేర్పిస్తున్నారు. గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
– గోవిందరాజు, జిల్లా విద్యాధికారి
●

ఆర్థిక తోడ్పాటు..