పంటల దిగుబడికి శాసీ్త్రయ సర్వే | - | Sakshi
Sakshi News home page

పంటల దిగుబడికి శాసీ్త్రయ సర్వే

Sep 14 2025 6:23 AM | Updated on Sep 14 2025 6:23 AM

పంటల

పంటల దిగుబడికి శాసీ్త్రయ సర్వే

పకడ్బందీగా సర్వే..

నమోదు తప్పనిసరి..

జిల్లాలోని 13 మండలాల్లో 51 గ్రామాలు ఎంపిక

నర్వ: జిల్లాలో వానాకాలం సాగు.. పంట దిగుబడి అంచనాలను పక్కాగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మండలాల వారీగా ఎంపిక చేసిన గ్రామాలు, సర్వేనంబర్ల వివరాలను జిల్లా అధికారులకు పంపించారు. పంట కోత ప్రయోగాలు పకడ్బందీగా చేపట్టేందుకు సిబ్బందికి శిక్షణనిచ్చారు. కొత్తగా రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉండగా వ్యవసాయ, ప్రణాళికాశాఖ సిబ్బంది సంయుక్తంగా ప్రయోగాలు నిర్వహిస్తారు. ఈ వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 76 క్లస్టర్లలో 51 గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎంపిక చేసిన గ్రామాల్లో పంటల వారీగా శాసీ్త్రయంగా దిగుబడులను అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది వానాకాలంలో సాధారణ సాగు 4.20 లక్షల ఎకరాలు ఉండగా.. ఇప్పటికే 4 లక్షలు సాగు చేశారు.

వివరాల నమోదు ఇలా..

గ్రామాల వారీగా కేటాయించిన పంట పొలానికి అధికారులు వెళ్లాలి. పంటకోత ప్రయోగాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కొత్తగా రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేయాలి. నిర్దేశించిన పంటతో పాటు దిగుబడులను ఫొటోతో అప్‌లోడ్‌ చేయాలి. మండల సాగు విస్తీర్ణం మేరకు 3 నుంచి 5 గ్రామాలను పంట కోత ప్రయోగాలకు ఎంపిక చేశారు. రైతు పొలంలో నైరుతి భాగాన్ని ఎంపిక చేసి అక్కడి పంటను విడిగా కోసి తూకం వేస్తారు. పంట కోత ఫొటోతో పాటు తూకం ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి. సాగుకయ్యే పెట్టుబడి, వినియోగించిన ఎరువులు, పురుగు మందులు, ఆశించిన తెగులు తదితర వివరాలు నమోదు చేయాలి.

మండలాల వారీగా ఎంపికై న గ్రామాలు..

మండలం గ్రామాలు

దామరగిద్ద మొగుల్‌మడ్క, ఉల్లిగండం, అయ్యవారిపల్లి, పిడెంపల్లి

నారాయణపేట ఎక్లాస్‌పూర్‌, కవరంపల్లి, అప్పక్‌పల్లి, కోటకొండ

ఊట్కూర్‌ పెద్దజట్రం, ఊట్కూర్‌, సమస్తాపూర్‌, పగిడిమర్రి

మాగనూర్‌ నేరెడుగాం, పెగడబండ, పుంజనూర్‌, మందిపల్లి

కృష్ణా కున్సి, కృష్ణా, హిందూపూర్‌, ఐనాపూర్‌

మక్తల్‌ పస్పుల, చిన్నగోప్లాపూర్‌, సోమశ్వేరబండ, జక్లేర్‌

నర్వ రాజుపల్లి, యాంకి, కల్వాల్‌, ఎల్లంపల్లి

మరికల్‌ రాకొండ, మరికల్‌, పూసల్‌పహాడ్‌, మాద్వార్‌

ధన్వాడ గోటూర్‌, ధన్వాడ, పాతపల్లి, కిష్టాపూర్‌

మద్దూర్‌ పల్లెర్ల, చింతలదిన్నె, మోమిన్‌పూర్‌, లక్కపల్లి

గుండుమాల్‌ సారంగరావుపల్లి, గుండుమాల్‌, బోగారం,

బలభద్రాయపల్లి

కోస్గి లోదీపల్లి, సర్జఖాన్‌పేట, మీర్జాపూర్‌

కొత్తపల్లి నందిగాం, కొత్తపల్లి, మన్నాపూర్‌

సర్వే చేపట్టనున్న పంటలు..

వరి, జొన్న, మొక్కజొన్న, కంది, మిరప, పత్తి

వ్యవసాయ, ప్రణాళిక శాఖ

సంయుక్తంగా..

కొత్తగా రూపొందించిన యాప్‌లో వివరాల నమోదు

శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు

జిల్లాలో వానాకాలం పంటల దిగుబడి అంచనా వేసేందుకు పంటకోత ప్రయోగ సర్వేను పకడ్బందీగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డిజిటల్‌ జనరల్‌ క్రాప్‌ ఎస్టిమేషన్‌ సర్వే ఎలా నిర్వహించాలనే అంశాలపై సిబ్బందికి శిక్షణనిచ్చాం. సర్వేలో సేకరించిన వివరాలను యాప్‌లో ఎలా నమోదు చేయాలో వివరించాం. సర్వే ఆధారంగా ధరల నియంత్రణపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకునేందుకు దోహదపడనుంది. – సింగ్‌ యోగానంద్‌,

చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి, నారాయణపేట

డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు వచ్చే ఏఈఓలు, మండల ప్రణాళిక అధికారులకు రైతులు సహకరించాలి. ఎంపిక చేసిన గ్రామాల్లో పంటల దిగుబడిని అంచనా వేసేందుకు పంటకోత సమయంలో ప్రయోగాలు చేపట్టి వివరాలను యాప్‌లో నమోదు చేయాలి.

– నగేష్‌కుమార్‌, ఏడీఏ

పంటల దిగుబడికి శాసీ్త్రయ సర్వే 1
1/1

పంటల దిగుబడికి శాసీ్త్రయ సర్వే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement