మహిళల ఆర్థిక బలోపేతం దిశగా.. | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థిక బలోపేతం దిశగా..

Sep 4 2025 10:47 AM | Updated on Sep 4 2025 10:47 AM

మహిళల

మహిళల ఆర్థిక బలోపేతం దిశగా..

జిల్లాలో కొత్త సంఘాల ఏర్పాటుకు శ్రీకారం

సద్వినియోగం చేసుకోవాలి..

నర్వ: మహిళల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) కొత్త సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మహిళలు పొదుపుతో ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగా కొత్త సభ్యులతో మరిన్ని స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో 18నుంచి 58 ఏళ్ల మహిళలకు మాత్రమే స్వయం సహాయక సంఘాల్లో చోటు కల్పించగా.. తాజాగా 15ఏళ్ల కిషోర బాలికల నుంచి 60ఏళ్ల వృద్ధుల వరకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 7,072 మహిళా సంఘాలు ఉండగా.. 91,065 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల మేరకు మరో 3,380 మంది కొత్తగా సంఘాల్లో చేరారు. ఈ నెల 30వ తేదీ వరకు కొత్త సంఘాల ఏర్పాటుకు గడువు ఉన్న నేపథ్యంలో మరింత మంది చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇవీ మార్గదర్శకాలు..

నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన కిశోర బాలికలతో పాటు మహిళలు, దివ్యాంగులు స్వయం సహాయక సంఘాల్లో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు తీసుకుంటున్న మహిళలు సైతం అర్హులుగా నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో గ్రామీణాభివృద్ధి సంస్థ, ఇందిరా క్రాంతి పథకం అధికారులు 20 రోజులుగా కొత్త మహిళా సంఘాల ఏర్పాటు కోసం అర్హులైన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 15నుంచి 60 ఏళ్లలోపు వారు కొత్త సంఘాల్లో చేరే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో గ్రూపులో 10మంది సభ్యులు తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు ఉన్నప్పటికీ.. ఐదుగురు సభ్యులతోనూ కొత్త సంఘాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

కొత్త సంఘాల ఏర్పాటు..

కొత్త సంఘాల్లో ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో పాటు ఉద్యోగుల భార్యాపిల్లలకు చోటు ఉండదు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికే ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. జిల్లాలోని డీపీఎం, ఏపీఎంలు, సీసీలు, వీఓలు గ్రామాల్లో పత్యేకంగా సమావేశాలు ఏర్పాటుచేసి.. కొత్త సంఘాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. ఔత్సాహిక బాలికలు, మహిళలు సభ్యులుగా చేరేలా అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు కొత్త సంఘాలను ఏర్పాటుచేసి.. ఆన్‌లైన్‌లో గ్రూప్‌ల పేర్లు నమోదు చేస్తున్నారు.

15ఏళ్ల బాలికల నుంచి 60ఏళ్ల

వృద్ధులకు అవకాశం

ఇప్పటి వరకు

3,380మంది కొత్తగా చేరిక

మహిళా ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతోంది. జిల్లాలోని మహిళా సంఘాలకు పెద్దఎత్తున రుణాలు అందిస్తుండటంతో ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం 15ఏళ్ల బాలికల నుంచి 60ఏళ్ల వృద్ధుల వరకు మహిళా సంఘాల్లో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని జిల్లాలోని బాలికలు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. – మొగులప్ప, డీఆర్డీఓ

మహిళల ఆర్థిక బలోపేతం దిశగా.. 1
1/2

మహిళల ఆర్థిక బలోపేతం దిశగా..

మహిళల ఆర్థిక బలోపేతం దిశగా.. 2
2/2

మహిళల ఆర్థిక బలోపేతం దిశగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement