
సర్వం పోయింది
పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణలో ఊట్కూర్ మండలంలోని బాపుర్ గ్రామ శివారులో తన భార్య పేరుపై ఉన్న 2.28 ఎకరాల భూమి పోతుంది. ఆ గ్రామ శివారులో ఇంకో 49 ఎకరాలు భూమి పోతుండడంతో బాపురం, తిప్రాస్‌పల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం చెల్లించే రూ.14 లక్షలు సరిపోదు. వెంటనే ప్రభుత్వం బహిరంగా మార్కెట్ అనుగుణంగా తమకు భూ నష్టపరిహారం ఇవ్వాలి. – మశ్ఛందర్,
జిల్లా అధ్యక్షుడు, భూ నిర్వాసితుల సంఘం
న్యాయం జరిగే వరకు పోరాటం
పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి తాము వ్యతిరేకం కాదు. రైతులకు భూ నష్టపరిహారాన్ని న్యాయపరంగా చెల్లించాలి. ఎకరాకు రూ.14 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే ఊరుకోం. జిల్లాకు చెందిన సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు న్యాయం చేసి ఆదర్శంగా నిలువాలి. అంతవరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. – వెంకట్రామరెడ్డి,
గౌరవ అధ్యక్షుడు, భూ నిర్వాసితుల సంఘం
రూ.14 లక్షలు చెల్లిస్తున్నాం
ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోతు న్న రైతులకు ఎకరానికి రూ. 14 లక్షలు చెల్లిస్తున్నాం. దీనికి రైతులు ముందుకు రాకపోతే జ నరల్ అవార్డు పాస్ చేసి ఎకరానికి రూ.10.50 లక్షలు చెల్లించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 39 మంది రైతులు ముందుకు వచ్చి నష్టపరిహారాన్ని తీసుకున్నారు. మిగతా రైతులు సహకరించి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలి.
– రాంచందర్‌నాయక్, ఆర్డీఓ, నారాయణపేట
●

సర్వం పోయింది

సర్వం పోయింది