
సన్న బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్‌దే..
మక్తల్: రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య సహకార శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం మక్తలో నూతన లభ్ధిదారులకు రేషన్ కార్డులను మంత్రితోపాటు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అందజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 7వేల రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 2.37లక్షల మందికి 74,013 రేషన్‌కార్డులు ఉండగా వారికి 622 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం పంపిణి చేసే వారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్తరేషన్‌కార్డులతో మొత్తం సంఖ్య 81,114 చేరిందని, 3 లక్షల మందికి ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రేషన్‌కార్డుల్లో మొత్తం 43,497 మంది పేర్లను నమోదు చేశామని, కొత్త కార్డులకు బియ్యానికిగాను ఆదనంగా రూ.5.6 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. ఇదిలాఉండగా, పట్టణంలో నూతన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఒక్క రేషన్ డీలర్ హాజరుకాకపోవడం ఏమిటని డీలర్లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయపై డీలర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్‌కుమార్, సురేష్, శ్రీనివాసులు, ఎంపిడిఓ రమేష్, శ్రీనివాసులు, చంద్రశేఖర్, కట్టసురేస్, వెంకటేస్, రవికుమార్, ఫయాజ్, నూరోద్దిన్, డిటి పుష్పలత, ఆర్‌ఐ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
మహిళా సంక్షేమానికి కృషి
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఇందిరమ్మ సంబరాలకు మంత్రి, కలెక్టర్ ముఖ్యఅతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా అమరచింత, నర్వ, ఊట్కూర్, మహిళా సంఘాలకు రూ.1.8 కోట్ల చెక్కును అందజేయడంతోపాటు, మూడు ఇందిరా మహిళా శక్తి సంఘాలకు చెందిన ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఆత్మకూర్, మక్తల్ మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ కొరకు రూ.6 కోట్ల చెక్కు అందజేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే నియోజక వర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని తెలిపారు. డీఆర్‌డీఓ మొగులప్ప, డీపీఎం జయన్న, మాసన్న, గోవిందు, ఏపిఎం వనజ, సీసీలు హన్మంతు, శ్రీనివాసులు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గానికి 7వేల నూతన రేషన్‌కార్డులు మంజూరు
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి