
రెండేళ్లలో పూర్తి చేస్తాం
సాక్షి, నాగర్‌కర్నూల్/కొల్లాపూర్: పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసే బాధ్యత తాను తీసుకుంటున్నానని, రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పురాతన మదనగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. ‘కొల్లాపూర్ ప్రాంతం.. ఒకవైపు కృష్ణానది, మరోవైపు నల్లమల అటవీ ప్రాంతం.. ఒకప్పుడు కౌన్ పూచ్‌తా కొల్లాపూర్ అనుకున్న ప్రాంతాన్ని, హమ్ జాదా లేనా కొల్లాపూర్ అంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం’ అని అన్నారు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా, తట్ట, పార పని చేసినా పాలమూరు బిడ్డలే ఉంటారని చెప్పారు. ఇక్కడి మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం బాధ్యతను తీసుకుంటానని అన్నారు. డిసెంబర్ 9 నాటికి అన్ని ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు పెండింగ్ పరిహారాన్ని చెల్లిస్తామని, భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. రెండేళ్ల కాలంలో పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని పేర్కొన్నారు. ‘పాలమూరు బిడ్డగా ఇక్కడి పరిస్థితులు, కష్టాలు నాకు తెలుసు. గత ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, కేఎల్‌ఐ, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు కట్టకుండా నిర్లక్ష్యం చేసింది. రైతుల పొలాల్లోకి నీళ్లు రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీఆర్‌ఎస్ పాలనలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం కావడం వల్ల మొన్న జూరాలకు నిమిషాలలో రూ.120 కోట్లు మంజూరు చేశాం. ఇక్కడి నుంచి గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వాళ్లు దొంగలకు సద్దులు మోశారు. మొన్నటి ఎన్నికల్లో ఇంకో రెండు సీట్లు వచ్చుంటే.. ఈ జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుండే.’ అని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులో ఒక్క మోటార్‌ను ప్రారంభించి చేతులు దులుపుకున్న కేసీఆర్.. ఈ గడ్డకు చేసిందేమీ లేదన్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు తెచ్చింది ఏమీ లేదు. 98 జీఓ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని శ్రీశైలం నిర్వాసితులు ఏళ్ల తరబడి అడుగుతూ వస్తున్నా.. వారిని గత ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదో చెప్పాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కొల్లాపూర్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, కొల్లాపూర్ అభివృద్ధికి అవసరమై సహకారం అందిస్తామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలు ఏడాదిన్నర లోపు పూర్తి చేసి, దాని ప్రారంభానికి మళ్లీ ఇక్కడికి వస్తా సీఎం అన్నారు.
మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,52,635 స్వయం సహాయక సంఘాలకు రూ.334 కోట్ల వడ్డీ లేని రుణాలను ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన చెక్కును మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని 2,671 స్వయం సహాయక సంఘాలకు రూ.6.33 కోట్ల చెక్కులను అందజేశారు. అలాగే బ్యాంక్ లింకేజీ రుణాలు, ప్రమాధ బీమా తదితర వాటిక సంబంధించి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, పర్ణికారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నాయకులు బెల్లయ్యనాయక్, సరిత, జగదీశ్వర్‌రావు, శివసేనారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు.
సాధికారత దిశగా పయనం: మంత్రి దామోదర రాజనర్సింహ
మహిళలు ఆర్థిక సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
బీసీ రిజర్వేషన్లు
చారిత్రాత్మకం: మల్లురవి
బీసీ రిజర్వేషన్ల అమలు చారిత్రాత్మక నిర్ణయమని, ఈ ఘ నత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కు తుందని ఎంపీ మల్లు రవి అన్నారు. రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేపట్టామని, విద్యార్థులకు కాస్మొటిక్, మెస్ చార్జీలు పెంచామన్నారు.
కొల్లాపూర్ అభివృద్ధికిసహకరించాలి: మంత్రి జూపల్లి
కొల్లాపూర్ నియోజకవర్గానికి అదనంగా మరో 3 వేల ఇళ్లు కేటాయించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. కొల్లాపూర్ అభివృద్ధికి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలని, శ్రీశైలం నిర్వాసితులకు జీఓ 98 ప్రకారం ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, మాదాసి కురువలకు ఎస్సీ కుల ధ్రువపత్రాలు ఇప్పించాలని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రూ.15 లక్షలు, కొల్లాపూర్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మొలచింతలపల్లి శివారులో ఉన్న 1,600 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, పెంట్లవెల్లి సింగిల్ విండో సొసైటీలోని 409 మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని, సోమశిల– సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి త్వరగా అటవీశాఖ అనుమతులు ఇప్పించాలని సీఎం దృష్టికి తెచ్చారు.
సంక్షేమానికి ప్రాధాన్యం:
మంత్రి వాకిటి
సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనా విధానంలో విద్య, ఉపాధి, రైతు, మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం లభిస్తోందని రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్య్సశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించడం అభినందనీయమన్నారు.
సాగునీటి ప్రాజెక్ట్‌ల బాధ్యత నాదే: సీఎం రేవంత్‌డ్డి
డిసెంబర్ 9 నాటికి భూసేకరణ పూర్తి చేస్తాం.. పరిహారం చెల్లిస్తాం
బీఆర్‌ఎస్ పాలనలోనే
పాలమూరుకు తీవ్ర అన్యాయం
గత ప్రభుత్వంలో జిల్లా మంత్రులుతెచ్చింది ఏమీలేదు
శ్రీశైలం నిర్వాసితులనుఎందుకు ఆదుకోలేదు
జటప్రోలులో యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన

రెండేళ్లలో పూర్తి చేస్తాం

రెండేళ్లలో పూర్తి చేస్తాం