క్షయ రహితం.. ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

క్షయ రహితం.. ప్రభుత్వ లక్ష్యం

Jul 19 2025 4:20 AM | Updated on Jul 19 2025 4:20 AM

క్షయ

క్షయ రహితం.. ప్రభుత్వ లక్ష్యం

నర్వ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సంపూర్ణ ఆరోగ్య రక్షణ కోసం టీబీ ముక్త్‌భారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా టీబీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న జనాభాకు స్క్రీనింగ్‌ చేసి ముందస్తుగా టీబీని గుర్తించవచ్చు. ఇంటింటికీ వెళ్లి అల్ట్రాపోర్టబుల్‌ హ్యాండ్‌–హెల్డ్‌ ఎక్సరే సాయంతో స్క్రీనింగ్‌ చేసి మధుమేహం, బీపీ, హెచ్‌ఐవీ తదితర వ్యాధుల సమూహాలను గుర్తిస్తారు. న్యాట్‌(న్యూక్లియిక్‌ యాసిడ్‌, యాంప్లిఫికేషన్‌ టెస్టింగ్‌) ఉపయోగించి నిర్ధారణ తర్వాత అనేక వ్యాధులను గుర్తిస్తారు. జిల్లాలో జూన్‌ 2 నుంచి 100 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు.

వ్యాధుల నిర్ధారణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యభారత్‌ కోసం చేపట్టిన ముక్తభారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని రాష్ట్రంలో టీబీ వ్యాధితో పాటు, షుగర్‌, బీపీ, హెచ్‌ఐవీ, ఎనీమియా, వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. తద్వారా ఈ వ్యాధులను గుర్తించడం, నిర్ధారణ అనంతరం వ్యాధిగ్రస్తులకు సరైన మందులు అందించడం, వ్యాధుల తీవ్రతను బట్టీ జిల్లా ఆసుపత్రులకు రెఫర్‌ చేసి మెరుగైన చికిత్స అందించనున్నారు. తద్వారా వ్యాధుల భారిన పడకుండా ప్రజలను చైతన్యపరచడం, అవగాహన కల్పించడం చేపట్టారు.

అత్యాధునిక పరికరాలతో స్క్రీనింగ్‌

జిల్లాలో గత జూన్‌ 2 నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఆయా మండలాల్లోని పీహెచ్‌సీల పరిధి సబ్‌సెంటర్‌లలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో రూ.20 లక్షల విలువ గల అత్యాధునిక అల్ట్రాపోర్టబుల్‌ హ్యాండ్‌–హెల్డ్‌ ఎక్సరే ద్వారా టీబీ వ్యాధి నిర్ధారణ చేపడుతున్నారు. ఈ పరికరాన్ని వైద్యశిబిరాలకు తరలించి అక్కడే వ్యాధి నిర్ధారణతో పాటు ఇతర వ్యాధుల నిర్ధారణ కోసం పరీక్షలు చేపట్టి మెరుగైన చికిత్సం కోసం 102 ద్వారా జిల్లా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి 6 నెలల పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రతి నెల రూ.వెయ్యి బాధితులకు అందిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యభారత్‌ కోసం చేపట్టిన ఈ కార్యక్రమం గత రెండు నెలలుగా జిల్లాలో కొనసాగుతుంది.

జిల్లాలో ఇలా ..

జిల్లా వ్యాప్తంగా ముక్తభారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా 40 వైద్యశిబిరాలు నిర్వహించారు. ఇందులో మొత్తం 3,987 పరీక్షలు నిర్వహించారు. అల్ట్రాపోర్టబుల్‌ హ్యాండ్‌ – హెల్డ్‌ ఎక్సరే ద్వారా 2,890 పరీక్షలు నిర్వహించగా.. ఎక్సరే పాజిటివ్‌ 42 వచ్చాయి. వీటితో పాటు హెచ్‌ఐవీ, వీడీఆర్‌ఎల్‌, హెపటైటిస్‌, టీబీ, బీపీ, షుగర్‌ పరీక్షలు చేపట్టి పాజిటివ్‌ రోగులను గుర్తించారు. వీరితో పాటు గత ఏడాది నవంబర్‌ నుంచి నేటి వరకు టీబీ వ్యాధిగ్రస్తులు 541 మందిని గుర్తించి వీరికి ప్రతి నెల రూ.1000 అందించాల్సి ఉన్న బడ్జెట్‌ లేమి కారణంగా నేటికి వీరికి అందడం లేదు.

‘టీబీ ముక్త్‌భారత్‌ అభియాన్‌’లోభాగంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు

జిల్లాలో వంద రోజులపాటువైద్య శిబిరాలు

అత్యాధునిక పరికరాలతోఅనుమానితులకు ఆరోగ్య పరీక్షలు

క్షయ రహితం.. ప్రభుత్వ లక్ష్యం 1
1/2

క్షయ రహితం.. ప్రభుత్వ లక్ష్యం

క్షయ రహితం.. ప్రభుత్వ లక్ష్యం 2
2/2

క్షయ రహితం.. ప్రభుత్వ లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement