నిషేధిత ప్లాస్టిక్‌ వాడితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిషేధిత ప్లాస్టిక్‌ వాడితే చర్యలు

Jul 19 2025 4:20 AM | Updated on Jul 19 2025 4:20 AM

నిషేధ

నిషేధిత ప్లాస్టిక్‌ వాడితే చర్యలు

కోస్గి రూరల్‌: నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార సముదాయాలలో నిషేధిత ప్లాస్టిక్‌ వాడితే జరిమానాతో పాటు చర్యలు తప్పవు మున్సిపల్‌ కమిషనర్‌ నాగరాజు అన్నారు. 100 రోజులు కార్యచరణలో భాగంగా శుక్రవారం పట్టణంలోని హోటల్స్‌, బెకరీలు, వ్యాపార సముదాయాలలో నిషేధిత పాస్టిక్‌ కవర్ల నియంత్రణ చర్యలను చేపట్టారు. నిబంధనలకు విరుద్దంగా ప్లాస్టిక్‌ కవర్లు విక్రయిస్తున్న పలు దుకాణాలౖపై దాడులు చేసి జరిమానా విధించారు. ప్రజలు ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి సంచులను వాడాలని, తమ టీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. పలు వ్యాపార సముదాయాలకు నూతన ట్రేడ్‌ లైసెన్స్‌లను జారీ, రెన్యూవల్‌ చేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరు బుట్టలలో వేయాలని, తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌, హెల్త్‌అసిస్టెంట్‌ మొహిన్‌బాషా, మున్సిపల్‌ అదికారులు, మెప్మా సిబ్బంది , కార్మికులు ఉన్నారు.

బతికున్నా..

రికార్డుల్లో చంపేశారు!

మక్తల్‌: బతికున్న వృద్ధురాలిని మృతిచెందిందని పింఛన్ల జాబితా నుంచి తొలగించిన ఘటన మండలంలోని జక్లేర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జక్లేర్‌ గ్రామానికి చెందిన ఫాతిమాబేగం వృద్ధాప్య పింఛన్‌ పొందుతుంది. ప్రతి నెల జకే్‌ల్‌ర్‌ పోస్టాఫీస్‌కు వెళ్లి పింఛన్‌ తీసుకునేది. గత రెండు నెలలుగా ఆమెకు వృద్ధాప్య పింఛన్‌ ఇవ్వడంలేదు. ఇదే విషయమై ఫాతిమాబేగం శుక్రవారం జక్లేర్‌ పోస్టాఫీస్‌కు వెళ్లి అక్కడి సిబ్బందితో ఆరా తీసింది. తనకు రెండు నెలల నుంచి పింఛన్‌ ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేయగా.. అక్కడి సిబ్బంది రికార్డుల్లో నువ్వు చనిపోయావని ఉందని, అందుకే పింఛన్‌ రాలేదని చెప్పారు. దీంతో తాను బతికే ఉన్నా ఎలా పేరు తొలగిస్తారంటూ రోదిస్తూ అక్కడి నుంచి వచ్చింది. అనంతరం విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లగా రికార్డులు పరిశీలించి, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటానని, పింఛన్‌ వచ్చేలా చూస్తానని అన్నారు.

ఓపెన్‌ స్కూల్‌ను

సద్వినియోగం చేసుకోవాలి

నారాయణపేట రూరల్‌: ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా టెన్త్‌, ఇంటర్‌ చదువుకునే వెసులుబాటు ఉందని, రెగ్యులర్‌గా విద్యాలయానికి రానివారు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్‌ రామకృష్ణ సూచించారు. పట్టణంలోని శ్రీ సాయి కళాశాల కేంద్రంలో శుక్రవారం ఓపెన్‌ స్కూల్‌ వాల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులకు, ఇంటి దగ్గరే ఉండే గృహిణులకు ఓపెన్‌ స్కూల్‌ ఎంతో ఉపకరిస్తుందని, ఇంటర్‌ ఏడాదిలోనే పూర్తి చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. తమకు ఇష్టమైన ఐదు సబ్జెక్ట్‌ లను ఎంపిక చేసుకోవచ్చని, రెగ్యులర్‌ సర్టిఫికెట్‌ తో సమానమని తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియంలో చదువుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు 99080 69789, 94419 06514లను సంప్రదించాలన్నారు.

బ్యాంకింగ్‌ సేవలను

వినియోగించుకోవాలి

కోయిల్‌కొండ: మహిళలు బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకొని ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి షణ్ముఖచారి అన్నారు. మండలంలోని రామన్నపల్లితండాలో నిర్వహించిన నాబార్డు ఫౌండేషన్‌ డేలో ఆయన రైతులు, గ్రామస్తులకు పండ్ల మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు నాబార్డు ఆధ్వర్యంలో స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, డెయిరీ, పౌల్ట్రీ తదితర రంగాల్లో రుణాలు పొందడానికి ముద్ర యోజన ద్వారా అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నాబార్డు అమలు చేస్తున్న వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధికి సహకార సంఘాల ఆవశ్యకత, సహకార భావనపై ప్రజలను చైతన్యం చేశారు. సామాజిక భద్రత పథకాలు, బ్యాంక్‌ రుణ ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. బ్యాంకు అధికారులు పథకాల అర్హతలు, దరఖాస్తు విధానం, ప్రయోజనా లపై ప్రజలకు సరళమైన భాషలో వివరించారు.

నిషేధిత ప్లాస్టిక్‌  వాడితే చర్యలు  
1
1/1

నిషేధిత ప్లాస్టిక్‌ వాడితే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement