
అంతా సిద్ధం
వనమహోత్సవం..
●
మొక్కలు నాటేందుకు సిద్ధం
అటవీశాఖతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లాలోని మిగతా 19 శాఖలతో కలుపుకొని 15.40 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాం. అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటేందుకు గుంతలను సిద్ధం చేసి ఉంచాం. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరితో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
– ప్రసాద్‌రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి, నారాయణపేట
నారాయణపేట: జిల్లాలో వనమహోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో ప్రారంభించేందుకు కలెక్టర్ సిక్తాపట్నాయక్ దిశానిర్దేశంతో డీఆర్‌డీఓ మొగులప్ప, అటవీశాఖ జిల్లా అధికారి ప్రసాద్‌రెడ్డి, 21 శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జూన్ మొదటి వారం నుంచే మొక్కలు నాటడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవానికి శ్రీకారం చుట్టింది. కాగా ఈ ఏడాది 15.40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటి వరకు 1.35 లక్షల మొక్కలు నాటించారు. నిర్ధేశించిన లక్ష్యంలో 9 శాతం పూర్తయింది.
డిపార్ట్‌మెంట్ల వారీగా మొక్కల లక్ష్యం
జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీలకు ఒక్కొక్క దానికి 96,750 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించారు. టీఎస్‌ఆర్టీసీకి 1000, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు 43,200, హార్టికల్చర్ అండ్ సెరి కల్చర్ 1.22లక్షలు, టీజీఎస్‌పీడీసీఎల్‌కు 500, మైన్స్ అండ్ జీయాలజీకి 600, హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు 500, ఐసీడీఎస్‌కు 500, పశుసంవర్ధకశాఖకు 100, మార్కెటింగ్‌కు 300, పోలీస్ శాఖకు 300, ట్రాన్స్‌ఫోర్ట్ 500, సివిల్‌సప్లయ్‌కు 300, బీసీ వెల్ఫేర్ 300, ఎకై ్సజ్‌శాఖకు 25,300, ఆర్‌అండ్‌బీకి 3 వేలు, ట్రైబల్‌వేల్ఫేర్‌కు 500, అగ్రికల్చర్‌కు 86,100, ఇరిగేషన్‌శాఖకు 500, జిల్లా విద్యాశాఖకు 500, డీఆర్‌డీఓకు 8.66లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
గ్రామీణాభివృద్ధి శాఖకు టార్గెట్ ఇలా
గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 705 సైట్లలో 5.54లక్షల మొక్కలు, 280 జీపీల్లో ఇంటింటా 3.22 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కేటగిరీలా వారీగా బండ్‌ప్లాంటేషన్ 6 వేలు, హర్టికల్చర్ 27,300, సంస్థాగత, కమ్యూటీ ప్లాంటేషన్ 2,49,750, ట్యాంక్‌బండ్ 25,300, ట్యాంక్‌బండ్ ఈత 23,500, ఈత ప్లాంటేషన్ 14 వేలు, ఈత ఇన్ సోసైటీ ల్యాండ్స్ 5 వేలు, మల్బరీబుస్15 వేలు, రోడ్‌సైడ్ ప్లాంటేషన్ 99,300, మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ 62,481, కెనాల్ బండ్ 25,600, బయో పెన్సింగ్‌లో 1500 మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు.
నిరాడంబరంగా ప్రారంభం
నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం ఫర్ణికారెడ్డి మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ముందువరుసలో హర్టికల్చర్ అండ్ సెరీకల్చర్
గ్రామీణాభివృద్ధి శాఖకు 8.66 లక్షల మొక్కలు కేటాయించగా గాను 24 వేల మొక్కలు నాటి 2.78 శాతం పూర్తి చేశారు. అటవీశాఖ 43,200 మొక్కలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 280 మొక్కలు మాత్రమే నాటారు. హర్టికల్చర్ అండ్ సెరి కల్చర్ లక్ష్యం 1,22,600 మొక్కలకు గాను 98,700 మొక్కలు నాటి 80 శాతానికి చేరుకున్నారు. ఎకై ్సజ్‌శాఖ 720, మున్సిపాలిటీల్లో 290 మొక్కలను అడపదడపా నాటేశారు. వ్యవసాయశాఖ ఈ ఏడాది 86,100 లక్ష్యం కాగా ఇంత వరకు ఒక్క మొక్క నాటలేదు.
జిల్లాలో ..
భూ విస్తీర్ణం 2,33,644 హెక్టర్లు
ఫారెస్ట్ ఏరియా 462 హెక్టర్లు
ఫారెస్టు శాతం 3.621 శాతం
ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్
లక్ష్యం 0.432 లక్షలు
డీఆర్‌డీఏ లక్ష్యం 8.671 లక్షలు
ఇతర శాఖలు 6.303 లక్షలు
289 నర్సరీలు..
81 రకాలు మొక్కలు
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 280, ఫారెస్టు ఆధ్వర్యంలో 6 నర్సరీల్లో 20,15,841 మొక్కలు అందుబాటులో ఉండగా అందులో మీటర్ పైన పొడవు ఉన్న మొక్కలు 3,32,240,, మీటర్‌లోపు 9,77,601, పెంచుతున్న మొక్కలు 7,06,000 ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో నర్సరీలు అందుబాటులో మొక్కలు
డిపార్ట్‌మెంట్ నర్సరీలు మొక్కల పొడవు మీటర్ పైన మీటర్‌లోపు పెంపుదల
ఫారెస్ట్ 06 2,10,900 36,290 1,74,610 ––
డీఆర్‌డీఏ 280 16,99,941 2,49,950 7,49,991 70,000
మున్సిపాలిటీలు 03 1,05,000 46,000 58,000 6,000
మొత్తం 289 20,15,841 3,32,240 9,77,601 70,600
మొక్కల లక్ష్యం 15.40 లక్షలు
తవ్విన గుంతలు 1,96,342
నాటిన మొక్కలు 1.35 లక్షలు
మంత్రి వాకిటి శ్రీహరితో అధికారికంగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

అంతా సిద్ధం

అంతా సిద్ధం