
జిల్లావ్యాప్తంగా తనిఖీలు..
బాలబాలికలను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా జిల్లాలో పోలీస్‌శాఖ, కార్మికశాఖలతో పాటు ఇతర శాఖల సమన్వయంతో గత పదిరోజులుగా దాడులు నిర్వహిస్తున్నాం. పిల్లలను పనిలో పెట్టుకుంటే అట్టి వారిపై కేసులు నమోదు చేస్తాం. ఇప్పటి వరకు దాదాపు 30 మంది బాలకార్మికులను గుర్తించాం.
– మహేష్‌కుమార్, కార్మికశాఖ జిల్లా అధికారి
కఠిన చర్యలు తప్పవు
జిల్లాలో జులై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ మేరకు ప్రత్యేక బృందాల ద్వారా బాలకార్మికుల విముక్తి కోసం వరుసగా దాడులు నిర్వహించి బాలకార్మికులను చేరదీసి వీరిని పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ దాడుల్లో ఇతర రాష్ట్రాల బాలబాలికలు ఉంటే వారిని సొంత రాష్ట్రాలకు పంపిస్తాం. బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవు. బాలలను పనిలో పెట్టుకున్న వారి సమాచారం అందించాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.
– యోగేష్‌గౌతమ్, ఎస్పీ
●