
పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం
నారాయణపేట: జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నగరంలో ఎక్కడ చూసినా మురుగు నీరే దర్శనమిస్తోంది. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం, పట్టింపు లేని సిబ్బంది కారణంగా పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిన్నపాటి వర్షానికే డ్రెయినేజీలు నిండి మురుగు రోడ్లపైకి వస్తోంది. దీంతో రోడ్లన్నీ కంపు..కంపు కొడుతున్నాయి. ఇళ్ల మధ్య నిలిచే మురుగు.. పందులు, దోమలకు ఆవాసాలు మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు మండిపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులతోపాటు పలు కొత్త కాలనీల్లోని రోడ్లపై నిత్యం మురుగు పారుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సీజనల్ వ్యాధుల ముప్పు
మున్సిపాలిటీల్లో డ్రెయినేజీలు మురుగునీటితో అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలను సీజనల్ వ్యాధుల ముప్పు వెంటాడుతోంది. ఇళ్ల మధ్య మురుగు కుంటలు ఏర్పడడం, కొత్త కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, విధిగా డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం, చెత్త తరలించకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమకాటుతో ప్రజ లు మలేరియా, డెంగీ, టైఫాయిడ్ జ్వరాల భారిన పడుతున్నారు. అంతేగాక, వర్షాలు పడుతుండడంతో పలు చోట్ల మిషన్ భగీరథ పైపులైన్‌లు లీకేజీలు కావడం, డ్రెయినేజీ నీరు తాగునీటి పైపుల్లోకి చేరడంతో డయేరియా వ్యాధులు వచ్చే అవకాశముందంటూ భయందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘పేట’ పురపాలికలో వర్షానికే నిండుతున్న డ్రెయినేజీలు
రోడ్లపై మురుగుతో
కంపుకొడుతున్న కాలనీలు
పందుల స్వైర విహారం..
దోమల బెడద తీవ్రం
పొంచి ఉన్న సీజనల్ వ్యాధులముప్పు

పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం