
‘ప్రజావాణి’ అర్జీలను త్వరగా పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 46 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ ట్రైని కలెక్టర్ ప్రణయ్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 9 ఫిర్యాదులు
ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో 9 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ యోగేష్‌గౌతమ్ నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్‌లో ఉంచరాదని, ప్రజలకు తక్షణమే న్యాయం అందించి పోలీస్ వ్యవస్థ పై నమ్మకం భరోసా కలిగేలా విధులు నిర్వర్తించాలని అన్నారు.
సమగ్ర నివేదికలతో రండి
నారాయణపేట: అధికారులు సమగ్ర నివేదికలతో మంగళవారం జరిగే వీడియో కాన్ఫరెన్‌న్స్‌కు హాజరుకావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్‌కు ఏసి (ఆర్), డి.డబ్యూఓ, డీఈఓ, డీఎంహెచ్‌ఓ ఇతర శాఖల అధికారులు అన్ని నివేదికలను సిద్ధం చేసుకుని హాజరు కావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ ట్రైని కలెక్టర్ ప్రణయ్ కుమార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.