
జగన్నాథ పాహిమాం.. పురుషోత్తమ రక్షమాం
నారాయణపేట టౌన్: జగన్నాథ పాహిమాం.. పురుషోత్తమ రక్షమాం.. అన్న ప్రార్థనలతో జిల్లా కేంద్రం మార్మోగింది. సోమవారం జిల్లాకేంద్రంలో జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులకు హారతి, పూజలు చేశారు. సరాఫ్ బజార్ బాలాజీ మందిరం నుంచి రథయాత్ర ప్రారంభమైంది. భక్తుల జై జగన్నాథ, హరేరామ్.. హరేకృష్ణ నామస్మరణతో పాలమూరు వీధులో మార్మోగాయి. జగమేలే జగన్నాథుడి రథయాత్ర దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. రథన్ని లాగేందుకు జనం పోటీపడ్డారు. రథయాత్ర మెయిన్ చౌక్ మీదుగా సత్యనారాయణ చౌరస్తా వరకు నిర్వహించారు. మహిళలు బతుకమ్మ మాదిరిగా ఆడి పాడారు. పలు ధార్మిక సంస్థ సభ్యులు హాజరై రథయాత్రలో భాగంగా స్వయంగా తాడుతో రథాన్ని లాగారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లా కేంద్రంలో కనులపండువగాజగన్నాథ రథయాత్ర