బస్ షెల్టర్ నిర్మించాలి..
దేవరకద్రలో ప్రయాణికులు నిలువ నీడ లేక ఎండకు, వానకు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌ఓబీ ప్రారంభం తర్వాత బస్సుల రాకపోకలు లేక బస్టాండ్ మూతబడింది. దీంతో ఆర్‌ఓబీకి రెండు వైపులా నిలబడి ప్రయాణికులు బస్సులు ఎక్కుతున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలికంగా రెండు వైపులా బస్ షెల్టర్లు నిర్మించాలి.
– సాంబశివుడు, ప్రజా సంఘం నాయకుడు, దేవరకద్ర
వ్యాపారాలు జరుగతలేవు..
దేవరకద్ర రెండుగా విడిపోయినప్పటి నుంచి వ్యాపారాలు జరగడం లేఉద. గతంలో ఇతర గ్రామాల ప్రజలు గేటు దాటి వచ్చేవారు. ఇప్పుడు గేటు దాటడానికి వీలు లేకుండా పోయింది. దీంతో ప్రజలు పాత బస్టాండ్ వైపు రావడం లేదు. వచ్చిన వారంతా అటు నుంచి అటే వెళ్లిపోతున్నారు. దీంతో తమ వ్యాపారాలు సరిగా నడవడం లేదు. వెంటనే ఆర్‌యూబీ నిర్మాణం చేపడితే సమస్య తీరి పట్టణం మళ్లీ ఒక్కటిగా మారుతుంది.
– కిషోర్,
కిరాణం వ్యాపారి, దేవరకద్ర
●
బస్ షెల్టర్ నిర్మించాలి..


