జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,821, కనిష్టంగా రూ.5,659 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,889, కనిష్టంగా రూ.6,680, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,280, కనిష్టంగా రూ.2,027, జొన్నలు గరిష్టంగా రూ.4,527, కనిష్టంగా రూ.4,027, ఆముదాలు గరిష్టంగా రూ.6,345, కనిష్టంగా రూ.6,225 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆముదాల ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,011 ఒకే ధర నమోదైంది. ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు రూ.1,962గా ఒకే ధర లభించింది. సీజన్ లేకపోవడం వల్ల లావాదేవీలు తక్కువగా జరిగాయి.
ఇండోర్ స్టేడియంలో కబడ్డీ సింథటిక్ మ్యాట్లు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడాశాఖకు శనివారం కబడ్డీ సింథటిక్ మ్యాట్లు చేరాయి. 35ఎంఎం సైజు గల 300 మ్యాట్‌లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఒక కబడ్డీ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ కబడ్డీ సింథటిక్ మ్యాట్‌లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఈ సింథటిక్ ట్రాక్‌లు పంపించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి కృషితో జిల్లాకు కబడ్డీ సింథటిక్ మ్యాట్‌లు వచ్చినట్లు తెలిపారు. కబడ్డీ మ్యాట్‌పై ప్రాక్టీస్ చేయడం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు.