
నారాయణపేట రూరల్: పట్టణ శివారులోని గుర్మిట్కల్ బోరబండ లక్ష్మి తిమ్మప్పస్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది. నరేందర్ రాథోడ్ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, రథోత్సవం, డోలారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఎస్పీ బాలు ఫ్యాన్స్ సంఘం అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి నేతృత్వంలో చిన్నారులు, కళాశాల విద్యార్థులు నృత్యాలు చేశారు.
ఘనంగా తిరుమలనాథ స్వామి జాతర
నారాయణపేట రూరల్: మండలంలోని తిర్మలాపూర్ గ్రామ శివారులోని గుట్టపై స్వయంభువుగా వెలిసిన శ్రీ తిరుమలనాథ స్వామి జాతర గురువా రం ఘనంగా ప్రారంభమైంది. ముందుగా శ్రీలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో అభిషేకం, అర్చన, మహామంగళ హారతి కార్యక్రమాలు కనుల పండువగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, మార్కెట్ వైస్‌చైర్మన్ లక్ష్మీకాంత్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు, పి.శ్రీనివాసులు, కెంచె శ్రీనివాస్, గ్రామస్తులు గోవింద్‌రెడ్డి, నారాయణరెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, సర్పంచ్ అంజమ్మ, ఎంపీటీసీ బసప్ప పాల్గొన్నారు. ఉత్సవాల్లో రెండో రోజు శుక్రవారం తెల్లవారుజామున స్వామివారి రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
కొల్లూరుకు
హంపీ పీఠాధిపతి
ఊట్కూరు: మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన నర్సింహారెడ్డిని గురువారం హంపీ పీఠాధిపతి విద్యారణ్యభారతిస్వామి పరామర్శించారు. నెలరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో నర్సింహారెడ్డి కాలికి గాయమైంది. దీంతో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పీఠాధిపతి, బాధితుడిని పరామర్శించారు. సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, ఎంపీటీసీ హనుమంతు, మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

