దొంగ మస్టర్లతో నిధుల మేత! | - | Sakshi
Sakshi News home page

దొంగ మస్టర్లతో నిధుల మేత!

Apr 3 2026 7:38 AM | Updated on Apr 3 2026 7:38 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2025–26లో దొంగ మస్టర్లలో లక్ష్యాన్ని సాధించామనిపించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా టీడీపీ కార్యకర్తలే నియమితులయ్యారు. టీడీపీ నేతలకు భారీగా ముడుపులు ఇచ్చుకొని ఏపీఓలు, ఈసీలు ఆదాయం బాగా ఉన్న మండలాలకు పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు. వెరసి 2025–26లో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి పనులకు 10 మంది వస్తే వంద మంది హాజరైనట్లు మస్టర్లు వేసి నిధులు కొల్లగొట్టారు. 2025–26లో కర్నూలు జిల్లాలో 58 లక్షలు, నంద్యాల జిల్లాలో 58 లక్షల పనిదినాలు కల్పించాలనేది లక్ష్యం. అయితే కర్నూలు జిల్లాలో 64,87,635, నంద్యాల జిల్లాలో 61,37,869 పని దినాలు కల్పించినట్లు స్పష్టమవుతోంది. ఇబ్బడిముబ్బడిగా దొంగ మస్టర్లు వేసి ఫీల్డ్‌ అసిస్టెంటు మొదలుకొని ఏపీఓల వరకు నిధులు కొల్లగొట్టారు. ఉమ్మడి జిల్లాలో 1,26,25,504 పనిదినాలు కల్పించినట్లు లెక్కలు ఉన్నాయి.

గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లా నుంచి వ్యవసాయ కూలీలు వలస వెళ్లారు. నిజంగా ఈ పనిదినాలు కల్పించి ఉంటే వంద రోజుల పని దినాలను వినియోగించుకున్న కుటుంబాలు భారీగా ఉండాలి. కర్నూలు జిల్లాలో 3702 కుటుంబాలు, నంద్యాల జిల్లాలో 4550 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని దినాలు కల్పించినట్లు స్పష్టమవుతోంది. అలాగే పల్లె పండుగ కింద చేపట్టిన షెడ్లకు స్పందన కరువైంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 1400 చొప్పున పశువుల షెడ్లు నిర్మించాలనేది లక్ష్యం. అయితే కర్నూలు జిల్లాలో 561, నంద్యాల జిల్లాలో 257 పశువుల షెడ్లు మాత్రమే నిర్మించారు. కర్నూలు జిల్లాలో ఫాంఫాండ్స్‌ 4 వేలు నిర్మించాలనేది లక్ష్యం కాగా 488, నంద్యాల జిల్లాలో 2 వేలు లక్ష్యం కాగా కేవలం ఐదు మాత్రమే నిర్మించడం గమనార్హం. తుగ్గలి మండలంలో ఉపాధి పనులకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఈ మండలంలో సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఏపీఓ టీడీపీ నేతలకు పెద్దఎత్తున ముడుపులు ఇచ్చుకొని పోస్టింగ్‌ పొందారనే విమర్శలు ఉన్నాయి. ఇటువంటి వారు అనేక మంది ఉన్నారు. మీరు దొంగ మస్టర్లు ఎన్నైనా వేసుకోండి మాకు మాత్రం వారం.. వారం ముడుపులు ఇచ్చుకోవాల్సిందేనని రేటు పెట్టినట్లు తెలుస్తోంది. తుగ్గలి, కౌతాళం, ఆదోని, కొసిగి, సి.బెళగల్‌, ప్యాపిలి, డోన్‌, బేతంచెర్ల తదితర మండలాల్లో దొంగ మస్టర్లదే పైచేయి కావడం గమనార్హం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముగిసి కొత్తగా వీబీ జీ రామ్‌జీ అమల్లోకి వస్తుండటంతో నిధుల స్వాహాపైనే దృష్టి కేంద్రీకరించడం గమనార్హం.

ఉపాధిలో 2025–26లో

సాధించిన ప్రగతి ఇదే

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో

లక్ష్యానికి మించి పనిదినాలు

కల్పించినట్లు లెక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement