జీసస్‌ అక్షరాలతో యేసు చిత్రం | - | Sakshi
Sakshi News home page

జీసస్‌ అక్షరాలతో యేసు చిత్రం

Apr 3 2026 7:38 AM | Updated on Apr 3 2026 7:38 AM

నంద్యాల(వ్యవసాయం): పట్టణానికి చెందిన బ్యాంకు ఉద్యోగి మాణిక్యరావు గుడ్‌ఫ్రైడే పురస్కరించుకొని జీసెస్‌ అక్షరాలతో మైక్రో ఆర్ట్‌ చిత్రాన్ని గురువారం చిత్రించారు. ఆయన మాట్లాడుతూ.. జీసెస్‌ పేరులోని అక్షరాలతో చిత్రాన్ని చిత్రీకరించినట్లు చెప్పారు.

వైద్యుడికి చార్జ్‌ మెమో

చాగలమర్రి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ ఇమ్రాన్‌కు డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ నుంచి చార్జి మెమో జారీ అయినట్లు వైద్యాధికారిణి అంజలి తెలిపారు. హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, ఆరోగ్యశ్రీ, జేఎస్‌ఎస్‌కే తదితర పథకాల నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు తోటి వైద్యులు, సిబ్బందితో పాలనాపరమైన సమన్వయం పాటించడంలో విఫలమయ్యారని అభియోగాలు నమోదయ్యాయి. దీనివల్ల పీహెచ్‌సీ పనితీరుకు ఆటంకం కలిగిందని మెమోలో పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశించినట్లు డాక్టర్‌ అంజలి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement