సగరులు అన్ని రంగాల్లో రాణించాలి
ఎమ్మిగనూరుటౌన్: సగరులు (ఉప్పరులు) అన్నిరంగాల్లో రాణించాలని ఏపీ సగర కార్పొరేషన్ చైర్మన్ రంగేవల్లి వెంకటరమణ అన్నారు. ఆదివారం పట్టణంలో ని ఉప్పర కల్యాణ మండపంలో రాష్ట్ర సగర ఉపాధ్యా య, ఉద్యోగ, పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇటీ వల ఉద్యోగ, ఉపాధ్యాయ కొలువులు సాధించిన ఉప్పర కులస్తులను సత్కరించారు. సమ్మేళన కార్యక్రమంలో పెనుగొండ డీఎస్పీ నరసింగప్ప, పల్నాడు జిల్లా డ్వామా పీడీ సిద్దలింగప్ప, శ్రీశైలం సగర సత్రం అధ్య క్షుడు కృష్ణయ్య, హైదరాబాద్ జేఎన్‌టీయూ ప్రొఫెసర్ జయలక్ష్మి, బద్వేల్ రిటైర్డ్ డీఎస్పీ వెంకట య్య, కేవీఆర్ కళాశాల ప్రొఫెసర్ పార్వతీదేవి, నాయ కులు ఏపీ వీరన్న, కృష్ణమూర్తి, రవీంద్ర పాల్గొన్నారు.


