ఉపాధి హామీ చట్ట సవరణను ఉపసంహరించాలి
నంద్యాల(న్యూటౌన్): కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఉపాధి హామీ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బిల్లు ప్రతులను దహనం చేశారు. ఆదివారం చాపిరేవుల, పోలూరు గ్రామాల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో నంద్యాల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం. నరసింహ నాయక్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు కావడంతో జిల్లాలో సన్న, చిన్నకారు రైతుల బీడు భూములు సాగు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో కూలీల కుటుంబాలకు ఉపాధి పనులు దిక్కయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన వీబీజీ రామ్‌జీ బిల్లును వెంటనే ఉపసహరించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసా య కార్మిక సంఘం జిల్లా నాయకులు కృష్ణ, చింతలయ్య, సుబ్బారాయుడు, సుబ్బారెడ్డి, జయన్న, శ్రీనివాస్ గౌడ్, తులసి రెడ్డి, రాజన్న, చంద్రమ్మ, రామ లచ్చమ్మ, పర్వీన్, జుబేదా, ఎం లక్ష్మ, సాల మ్మ, ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.


