జనహితుడికి నీరాజనం..
శ్రీశైలం నియోజకవర్గంలో జగనన్న పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని తాకాయి. ఊరూరా అభిమానులు, పార్టీ నాయకులు కేకులు కట్ చేశారు. ఆత్మకూరు పట్టణంలో పార్టీ పట్టణ అధ్యక్షడు సయ్యద్‌మీర్, పట్టణ, మండల వైఎస్సార్ సీపీ మహిళా అధ్యక్షురాలు దర్గమ్మ, పార్వతి ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే వెలుగోడులో జిల్లా ఉపాధ్యక్షులు దేశం తిరుపంరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో వేల్పనూరులోని అంకాల పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


