జగనోత్సాహంతో..
డోన్ పట్టణంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాఽథ్ స్వగృహంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ జాకీర్‌హుస్సేన్ ఆధ్వర్యంలో 500 మంది కార్యకర్తలు, నాయకులు రక్తదానం చేశారు. శిబిరం ప్రారంభం కాకముందే కార్యకర్తలు రక్తదానం చేసేందుకు బారులుదీరారు. మహిళలు సైతం రక్తదానం చేశారు. రైల్వేస్టేషన్ సమీపంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
రక్త బంధువులై..
నందికొట్కూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ దారా సుధీర్ ఆధ్వర్యంలో కర్నూలు – గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద కార్యకర్తలు, అభిమానులు, నాయకు లు కేక్ కట్ చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో బాలింతలు, గర్భిణులు, రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయం వద్ద 101 మంది జగనన్న అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా దారా సుధీర్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల రూపకర్తగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. తండ్రి వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా గత ఐదేళ్లలో జగనన్న సుపరి పాలన అందించారన్నారు. నాటి పథకాలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు.
ఊరూరా పండుగలా..
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జననేత పుట్టిన రోజును వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజలు పండుగలా నిర్వహించుకున్నారు. ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాఽథ్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు బ్రెడ్డు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛదంగా రక్తదానం చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్‌రెడ్డి నివాసంలో కార్యకర్తలు కేక్‌కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
జగనోత్సాహంతో..
జగనోత్సాహంతో..


