క్రీడలతో మానసికోల్లాసం
నంద్యాల (వ్యవసాయం): క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజ, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమని, ప్రిన్సిపాల్ జూనియర్ సివి ల్ జడ్జి శ్రీనివాసులు అన్నా రు. ఆదివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ సెక్రటరీ దాసరి చిన్న లింగమయ్య మాట్లా డుతూ క్రికెట్ పోటీలలో కోర్టు సిబ్బంది విన్నర్‌గా, న్యాయవాదుల గ్రూపు రన్నర్‌గా నిలిచిందన్నారు. ఇరు జట్లకు జడ్జీలు ట్రోఫీలు, నగదు బహుమతి అందజేశారు. అనంతరం బార్ అసోసియేషన్ కార్యాలయంలో క్రిస్మస్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు హుస్సేన్‌బాషా, హరి ప్రసాద్ రెడ్డి, విజయ శేఖర్ రెడ్డి, సుబ్బరాయుడు, ఓబుల్ రెడ్డి, సౌజన్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


