ఖలీల్.. వహ్వా!
కర్నూలు కల్చరల్: సంగీత సవ్వడులకు కాలు కదపడం.. మధురమైన సంగీతానికి మైమరిచిపోతుంటాం. అలాంటి సంగీత వాయిద్యాల్లో బుల్‌బుల్ తారా (ఎలక్ట్రికల్ బ్యాంజో) ఒకటి. గజల్, ఖవ్వాలి ప్రదర్శనల్లో ఆ పాటలకు బుల్‌బుల్ తారా వాయిద్యం నుంచే వెలువడే సవ్వడులు, వాయిద్య కారుడు తన చేతివేళ్లతో లయబద్దంగా వాయిద్యం తీగలను, బటన్స్‌ను మీటడంతో వచ్చే శబ్ధాలు మనసుకు వినసొంపును ఇస్తాయి. అయితే ఈ బులుబుల్ తారా వాయిద్య పరికరాలు కాలంతో పాటు కనుమరుగవుతున్నాయి. ఈ వాయిద్యాన్ని వాయించే వారిని వేళ్లపై లెక్కించ వచ్చు. అలాంటి వారిలో కర్నూల నగరానికి చెందిన బుల్ బుల్ తారా వాయిద్య కళాకారుడు షేక్ ఖలీల్ అహ్మద్. ఇతని కళా నైపుణ్యాన్ని గుర్తించి తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో శనివారం ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈనేపథ్యంలో ఖలీల్ కళా ప్రస్థానం గురించి ఇలా..
వాయిద్యం తయారీలో దిట్ట..
స్వతహాగా కార్పెంటర్ అయిన ఖలీల్ తనకు ఎంతో ఇష్టమైన బుల్‌బుల్ తారా వాయిద్యాన్ని ఆయనే తయారు చేసుకుంటారు. పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే దొరికే ఈ వాయిద్యం ప్రారంభం ధర రూ. 20 వేలు. ఈయన వాయిద్యానికి సంబంధించిన పరికరాలను తెప్పించుకొని తనకు తీరిక ఉన్న సమయాల్లో రూ. 8 వేల లోపు ఖర్చుతో నెల రోజుల్లో తయారు చేసుకుంటారు. ఉమ్మడి జిల్లాల్లో ఈ వాయిద్యాన్ని వాయించడం, తయారు చేయడంలో ఖలీల్ ఒక్కరే ఉన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో
ఏకై క బుల్‌బుల్ వాయిద్య కళారుడు
16 ఏళ్ల వయస్సులో మొదలు పెట్టి
68 సంవత్సరాలుగా కొనసాగింపు
వాయిద్యం తయారు చేసుకోవడంతో
పాటు ప్రదర్శనల్లో మేటి
ఖలీల్ కళా నైపుణ్యానికి గుర్తింపుగా
ప్రతిభా పురస్కారం
నేడు ప్రదానం చేయనున్న
తెలుగు కళా సమితి


