ఉరుకుందకు పోటెత్తిన భక్తులు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం అమావాస్య కావడంతో భక్తులు తమ ఇంటి ఇలవేల్పును దర్శంచుకోవాడానికి వేలాదిగా తరలివచ్చారు. క్షేత్ర పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున 4 గంటలకు అర్చకులు స్వామివారి మూలవిరాట్‌కు సుప్రభాతసేవ, మహామంగళహరతి, ఆకుపూజ, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. భక్తుల సౌకార్యర్థం ఆదోని, ఎమ్మిగనూరు, కర్ణాటకలోని రాయచూరు, శిరుగుప్ప డిపో అధికారులు ప్రత్యేక బస్సులను నడిపారు. కౌతాళం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశా రు. అలాగే ఉరుకుందకు ఐదు కిలోమీటర్ల దూరంలో వెలసిన బుడుములదొడ్డి ఆంజనేయస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తుంగభద్ర నది ఒడ్డున మేళిగనూరు గ్రామంలో వెలసిన రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఉరుకుందకు పోటెత్తిన భక్తులు


