కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం మండలంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. శుక్రవారం సున్నిపెంటలో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలు కాగా గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలకు చేరుకుంది. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి ప్రభావం మొదలవుతుంది, ఉదయం పది గంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదు. రహదారిలో ఎదుటి వ్యక్తి కూడా కనబడని విధంగా మంచు తెరలు ఏర్పడుతున్నాయి. వృద్ధులు, పిల్లలు, మహిళలు ఇంటి ముంగిట చలిమంటలతో వెచ్చదనాన్ని పొందుతున్నారు.
బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి
నంద్యాల(వ్యవసాయం): వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువు, సేవలకు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని తూనికలు కొలతల శాఖ జిల్లా అధికారి జిలాని, ఇన్‌స్పెక్టర్ అనిత అన్నారు. నంద్యాల రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ప్రయాణికులకు, వినియోగదారులకు అవగాహన కల్పించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకుని తూనికలు, కొలతల శాఖ, వినియోగదారుల సంఘాల సహకారంతో స్థానిక సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా సివిల్ సప్లై అధికారి రవిబాబు, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు అమీర్ బాషా, డిప్యూటీ తహసీల్దార్ శేఖర్ పాల్గొన్నారు.
ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తత అవసరం
● ఎస్పీ సునీల్ షోరాన్
నంద్యాల: క్రిస్మస్, న్యూఇయర్ బహుమతులంటూ సైబర్ నేరగాళ్లు చేసే ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు ఎస్పీ సునీల్ షోరాన్ సూచించారు. ఎస్సీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నట్లు చెప్పారు. క్రిస్మస్, న్యూఇయర్ గిఫ్ట్‌లు అంటూ వాట్సాప్, ఈమెయిల్‌కు సందేశాల రూపంలో లింక్‌లు వస్తాయన్నారు. వాటిని చూసి మోసపోవద్దన్నారు. రూ.500 గిఫ్ట్‌కార్డును గెలుచుకోండి అంటూ లింక్ వస్తాయని వాటిని క్లిక్ చేయవద్దన్నారు. అలాగే ఏపీకే ఫైల్స్‌ను ఎలాంటి పరిస్థితిల్లో ఓపెన్ చేయవద్దన్నారు. పాన్‌కార్డు, ఆధార్ వంటి వాటి వివరాలు ఎవరితో పంచుకోవద్దన్నారు. ఫోన్ నంబర్ ఆధారంగా బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తారన్నారు. ఒకవేళ సైబర్ నేరానికి గురైతే వెంటనే సంబంధిత దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ హెల్ప్ లైన్ 1930కి ఫోన్ కాల్ చేయాలన్నారు.
వైభవంగా తిరుచ్చి మహోత్సవం
బేతంచెర్ల: శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి తిరుచ్చి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీల్లో కొలువుంచి ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. పుష్పాలంకరణ పల్లకీలో భక్తులకు స్వామి దర్శనమిచ్చారు. ఆలయ మాజీ చైర్మన్ లక్ష్మిరెడ్డి, ఆలయ ఉపకమిషనర్ రామాంజనేయులు, వేదపండితులు కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు.
పన్నులు సకాలంలో వసూలు చేయాలి
ఆదోని టౌన్: మున్సిపాలిటీకి వచ్చే పన్నులను సకాలంలో వసూలు చేయాలని మున్సిపల్ అధికారులను ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగరాజు ఆదేశించారు. ఆదోని సమీపంలోని సిరుగుప్ప బైపాస్ వద్ద ఉన్న డంపింగ్ యార్డును, అన్నా కాం్య టీన్‌ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సి బ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు.
కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలు
కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలు
కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలు


