సైన్స్ ప్రాజెక్టులతో పర్యావరణ పరిరక్షణ
రాష్ట్రస్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు ఇవే..
నంద్యాల(న్యూటౌన్): పర్యావరణ పరిరక్షణకు సైన్స్ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడతాయని డీఈఓ జనార్దన్‌రెడ్డి, డిప్యూటీ డీఈఓ శంకర ప్రసాద్ అన్నారు. నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా సైన్స్ ఫేర్‌ను నిర్వహించారు. వివిధ అంశాలపై 275 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. సైన్సు ప్రాజెక్టులు తయారు చేసే విద్యార్థులు భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా రాణించే అవకాశం ఉందన్నారు. చక్కటి అంశాలతో ప్రాజెక్టులు రూపొందిచడంతో విద్యార్థులను అభినందించారు. సోలార్ శక్తి వినియోగంపై పాణ్యం మండలం పిన్నాపురం హైస్కూలు ఉపాధ్యాయుడు సమయోను ప్రదర్శించిన ప్రాజెక్టు, అలాగే వెంకటాపురం ఉపాధ్యాయురాలు వెంకటేశ్వరమ్మ ప్రదర్శించిన డోర్ లాక్ సిస్టం ప్రాజెక్టు రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికై నట్లు జిల్లా కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి తెలిపారు. ఈనెల 23, 24న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయిలో సైన్స్‌ఫైర్ జరగనుంది.
ప్రాజెక్టు పేరు విద్యార్థిపేరు పాఠశాల
స్మార్ట్ అగ్రికల్చర్ పల్లవి నెరవాడ
తడిపొడి చెత్త మాదియ ఆత్మకూరు
వేరుచేయుట
మినీ వాటర్ క్రీన్ శశిధర్ రుద్రవరం
ఆంటీ స్లీప్ అలారం రోహిత్ బనగానపల్లె
గణిత క్విజ్ పరికరం ద్రాక్షాయణి గోస్పాడు
రియల్ టైం హెల్త్ కరీమూన్ శిరివెళ్ల
మానిటర్
వాటర్ కన్జర్వేషన్ రేవతి బండిఆత్మకూరు


