బాల్య వివాహాలు సాంఘిక దురాచారం
కర్నూలు: బాల్య వివాహాలు సాంఘిక దురాచారమని, అలాంటి వివాహాల వల్ల వారి జీవితాలు నాశనమవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ.కబర్ధి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు బాల్య వివాహాల నిర్మూలనకు వంద రోజుల జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాల్య వివాహి రహిత భారత్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కుటుంబాలతో పాటు పిల్లల భవిష్యత్తు కూడా నాశనమవుతుందన్నారు. 18 సంవత్సరాల్లోపు పెళ్లి చేసుకుంటే వారికి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా గర్భవతి అయితే శిశువు గర్భంలోనే మరణించే అవకాశముందన్నారు. బాల్య వివాహాలు చేసుకుంటే ఎన్నో నష్టాలు ఉంటాయన్నారు. బాలల సహాయం కోసం విడుదల చేసిన పోస్టర్లను జిల్లాలోని ప్రతి పాఠశాలలో ప్రదర్శిస్తామన్నారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ విజయ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, గేడ్–1 సూపర్‌వైజర్ రాజేశ్వరి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జుబేదాబేగం. లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు.


