విఖ్యాత్ ఎంపిక నిబంధనలకు విరుద్ధం
● విజయ డెయిరీ చైర్మన్
జగన్‌మోహన్‌రెడ్డి
నంద్యాల(అర్బన్): చాగలమర్రి మండలం ముత్యాలపాడు పాల ఉత్పత్తి దారుల పరస్పర సహకార సంఘం అధ్యక్షునిగా భూమా విఖ్యాత్‌రెడ్డిని నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక చేశారని నంద్యాల విజయ డెయిరీ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముత్యాలపాడు పాల సొసైటీ రికార్డులను మార్చి అర్హత లేకున్నా విఖ్యాత్‌ను డైరెక్టర్‌గా కో ఆప్షన్ చేసుకుని అధ్యక్షున్ని చేశారన్నారు. పాల సొసైటీలో సభ్యుడు కావాలంటే కనీసం 180 రోజుల పాటు 180 లీటర్ల పాలు సహకార సంఘానికి సరఫరా చేసి ఉండాలన్నారు. సహకార సంఘం జాబితాలో లేని విఖ్యాత్‌ను అధ్యక్షునిగా ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. దీనిపై లిఖిత పూర్వక సంజాయిషీ ఇవ్వాలని ముత్యాలపాడు సహకార సంఘం పాలకవర్గ సభ్యులైన మాబుస్వామి, ఓబులేసు, తిమ్మారెడ్డి, నాగన్న, రమణారెడ్డి, రాంపుల్లారెడ్డిలకు నోటీసులు ఇచ్చామన్నారు.
విఖ్యాత్ మెంబర్‌షిప్ రద్దు
డైరీ డబ్బులు తీసుకొని భూమా విఖ్యాత్‌రెడ్డి డీఫాల్టర్ అయ్యాడని జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. యూనియన్‌కు తిరిగి డబ్బులు చెల్లించనందుకే చక్రవర్తుల పల్లె పాల సొసైటీ మెంబర్ షిప్ రద్దు చేశామన్నారు. అక్రమ మార్గంలో ముత్యాలపాడు సొసైటీ నుంచి అధ్యక్షుడినంటూ డెయిరీ వద్ద హంగామా చేస్తున్నారన్నారు. కర్నూలు మిల్క్ యూనియన్‌లో విఖ్యాత్ మెంబర్‌షిప్ రద్దుఅయిందన్నారు. ఆయనకు ఎక్కడా పోటీ చేసేందుకు అర్హత లేదన్నారు.


