జగన్ మళ్లీ సీఎం అయ్యేంత వరకు ఇలాగే...
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం అయ్యేంత వరకు ఏక రూప వస్త్రధారణ ధరిస్తా. నేటి నుంచి వెయ్యి రోజుల పాటు ఇలాగే ఉంటా. మాజీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించారు. ప్రస్తుతం బాబు పాలనలో మోసపోతున్న యువతలో చైతన్యం నింపేందుకు పార్టీ సీనియర్ నాయకులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ‘యువత మేలుకో’ అనే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలో వీధుల్లో మద్యం అందుబాటులోకి వచ్చింది. కేవలం 18 నెలల కాలంలోనే చంద్రబాబు పాలనపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థమవుతుంది. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించడం ఖాయం.
బీవై రామయ్య, నగర మేయర్


