మల్లన్న క్షేత్రం.. దేదీప్యమానం | - | Sakshi
Sakshi News home page

మల్లన్న క్షేత్రం.. దేదీప్యమానం

Nov 6 2025 8:26 AM | Updated on Nov 6 2025 8:26 AM

మల్లన

మల్లన్న క్షేత్రం.. దేదీప్యమానం

భక్తిశ్రద్ధలతో జ్వాలాతోరణోత్సవం

శాస్త్రోక్తంగా పుణ్యనదీ హారతి

వైభవంగా లక్షదీపోత్సవం

కనుల పండువగా పుష్కరిణి హారతి

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. పౌర్ణమిని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి దశవిధహారతులు దేదీప్యమానంగా సాగాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని, విశేషపూజా కార్యక్రమాలను కనులారా తిలకించి పునీతులయ్యారు.

జ్వాలాతోరణోత్సవం

కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయం నుంచి వత్తులను తీసుకువచ్చారు. ఆలయం ఎదురుగా గంగాధర మండపం వద్దకు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్టింప చేయించి అర్చకులు, పండితులు ప్రత్యేక పూజాదిహారతులిచ్చారు. అనంతరం నేతితో తడిపిన నూలు వత్తులను వెలిగించారు. ఇది తోరణంగా వెలిగింది. తోరణంలో కాలిన నూలు వత్తుల నుంచి వచ్చిన భస్మాన్ని భక్తులు నుదుట ధరించడం ఎంతో విశేషంగా భావిస్తారు. ఈ విధంగా ధరించడం వలన ఆయుష్షు, ఐశ్వర్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా విశేష పూజాదికాలను నిర్వహించి జ్వాలాతోరణం చుట్టూ మూడుసార్లు పల్లకీలో తిప్పారు.

లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతులు

ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణికి హారతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్షదీపోత్సవ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు ఆశీనులు చేసి అర్చకులు, వేదపండితులు విశేషంగా పూజాదికాలు నిర్వహించారు. అనంతరం పుష్కరిణి ప్రాంగాణమంతా లక్ష దీపాలను ఏర్పాటు చేసి వెలిగించారు. అలాగే శ్రీస్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులైన ఓంకార, నాగ, త్రిశూల, నంది, సింహ, సూర్య, చంద్ర, కుంభ, నక్షత్ర, కర్పూరహారతిలను ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజాదికాలను నిర్వహించి ఇచ్చారు.

మల్లన్న క్షేత్రం.. దేదీప్యమానం1
1/2

మల్లన్న క్షేత్రం.. దేదీప్యమానం

మల్లన్న క్షేత్రం.. దేదీప్యమానం2
2/2

మల్లన్న క్షేత్రం.. దేదీప్యమానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement