నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెలవెల
నంద్యాల(అర్బన్): స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయం ప్రజలు లేక బుధవారం వెలవెలబోయింది. డాక్యుమెంట్ రైటర్లు మూకుమ్మడిగా షాపులు మూసివేసి వెళ్లారు. కార్యాలయాల డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లు చెప్పిన వారికే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్టార్లు కుమ్మకై ్క అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు కార్యాలయాల్లో మూకుమ్మడి తనిఖీలు చేపట్టారు. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు జరుగుతాయన్న ఊహాగానాలు వచ్చాయి. దీంతో కార్యాలయంలో భోజన విరామ సమయం నుంచే ఎవరూ కనిపించకుండా పోయారు.
భద్రత నియమాలు పాటించాలి
నంద్యాల(న్యూటౌన్): విద్యాసంస్థలకు చెందిన బస్సులు, వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి అన్నారు. రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులతో, డిప్యూటీ డీఈఓ శంకర్ ప్రసాద్‌తో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీఓ శివారెడ్డి మాట్లాడుతూ.. రవాణా శాఖ సూచనలను పాటించాలని, లేదంటే పాఠశాల బస్సులను సీజ్ చేసి జరిమానా విధిస్తామన్నారు. సమావేశంలో మోటార్ వాహన తనిఖీ అధికారి జి. శ్రీకాంత్, సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారి జి. సుబ్బయ్య, నంద్యాల పట్టణంలోని వివిధ విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెలవెల


