ఆకతాయికి దేహశుద్ధి
ఆలూరు రూరల్: మండలంలోని హులేబీడు గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అనుమానాస్పదంగా కనిపించిన ఆకతాయిని గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. అదే గ్రామానికి చెందిన ఆకతాయి యువకుడు శివరాజ్ బడి వెనుక భాగంలో విద్యార్థినులు కాలకృత్యాలకు వెళ్లే ప్రదేశంలోని చెట్ల పొదల్లో చిన్న పాటి స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి రోజు పాఠశాల ఇంటర్వెల్ సమయంలో అక్కడ ఉంటున్నాడు. దీనిని గమనించిన మధ్యాహ్న భోజనం నిర్వాహకురాలు గ్రామస్తులు, ఉపాధ్యాయులతో కలిసి మంగళవారం రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. విద్యార్థులు కాలకృత్యాల కోసం వచ్చే ప్రదేశంలో నీకు ఏం పని అని ప్రశ్నించగా తాను బహిర్భూమికి వచ్చానని వారితో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహించిన స్థానికులు దేహశద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో యువకుడు అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడని పాఠశాల ప్రిన్సిపాల్ భూపాల్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


