
పోతిరెడ్డిపాడు నుంచి నీటి సరఫరా తగ్గింపు
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి ఎస్సారెమ్సీకి నీటి సరఫరాను తగ్గించినట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. మంగళ వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో పోతిరెడ్డిపాడు వద్ద 880.30 అడుగుల నీటిమట్టం ఉందని, కాగా పలు చోట్ల వర్షాలు కురుస్తుండటంతో నీటి విడుదలను తగ్గించామన్నారు.హెడ్‌రెగ్యులేటర్ ఐదు గేట్లను 0.2 మీటర్ల మేర ఎత్తి 3వేల క్యూసెక్కులు, ఎన్‌సీఎల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం 2 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 4వేల క్యూసెక్కులు, కేసీ ఎస్కేప్ కాల్వ కు 500, జీఎన్‌ఎస్‌ఎస్(ఎస్సార్బీసీ) కాల్వకు 500క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు.
ఆకాశదీపం వెలిగింది
మహానంది: కార్తీకమాసం పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో మంగళవారం రాత్రి ధ్వజస్తంభంపై ఆకాశదీపాన్ని వెలిగించారు. దీపగౌరి పూజల నిర్వ హించిన అనంతరం ధ్వజస్తంభం పైన ఆకాశ దీపం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు రవిశంకర అవధాని మాట్లాడుతూ ఆకాశ దీపం దర్శనం ద్వారా మంచి ఆలోచనలు కలగడంతో పాటు శుభాలు చేకూరుతాయన్నారు. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతలకు వైకుంఠానికి మార్గాన్ని శివకేశవులు చూపుతారని చెప్పారు. అందుకోసం ఆకాశ దీపాన్ని వెలిగించాలని కార్తీకపురాణంలో ఉందన్నారు. ఆకాశదీపం ద్వారా శివకేశవులు తమ తేజస్సును జగత్తుకు అందిస్తారన్నారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, పి.సుబ్బారెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.
శ్రీరాముని జీవితం స్ఫూర్తిదాయకం
జూపాడుబంగ్లా: శ్రీరాముని జీవితం మానవులకు స్ఫూర్తిదాయకమని తిరుమల తిరుపతి దేవస్థానం ఉమ్మడి కర్నూలు జిల్లా ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు మల్లు వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తూడిచెర్ల గ్రామంలోని శ్రీసీతారాముల వారి ఆలయంలో ధార్మిక ప్రవచనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముడు సూచించిన సత్యం, ధర్మం, జాలి, దయ, క్షమాగుణం, దాతృత్వం, వంటి సుగుణా లను అలవర్చుకోవాలని సూచించారు. అసూయను వీడి ఆపదలో ఉన్న వారికి సహా యం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. అనంతరం భజనమండలి సభ్యులు రాము లవారి గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో సర్పంచ్ బాలమద్దిలేటి, తితిదే ధర్మ ప్రచార మండలి సభ్యుడు రామచంద్రుడు, దొడ్డాసుధాకర్, రాము డు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయాలి
కోవెలకుంట్ల: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. రాజ్యాంగ దినో త్సవాల్లో (కాన్ట్సిట్యూషన్ డే సెలబ్రేషన్స్) భాగంగా మంగళవారం కోవెలకుంట్ల ప్రభుత్వ ఉన్నత, బాలికోన్నత, గురుకుల పాఠశాల, మండలంలోని రేవనూరు, గుళ్లదూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 8, 9,10వ తరగతి విద్యార్థులకు వివిధ అంశాలపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పోటీల్లో ప్రతి భ కనబరిచిన విద్యార్థుల్లో నియోజకర్గం నుంచి ఒకరిని ఎంపిక చేస్తామన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 175 మందిని ఎంపిక చేసి మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. ఆయన వెంట డోన్ డిప్యూటీ డీఈఓ వెంకట్రామిరెడ్డి, ఎంఈఓ వెంకటసుబ్బయ్య, హెచ్ ఎంలు మల్లికార్జున, అరుణకుమారి, సౌభాగ్యలక్ష్మి, సుందరయ్య, ఓబులయ్య పాల్గొన్నారు.

పోతిరెడ్డిపాడు నుంచి నీటి సరఫరా తగ్గింపు

పోతిరెడ్డిపాడు నుంచి నీటి సరఫరా తగ్గింపు