
● ప్రణాళిక బద్ధంగా క్యూలైన్ల నిర్వహణ ● మాసమంతా గర్భాలయ,
కార్తీక మాసోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేశామని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్ష మందిరంలో డీఈఓ, పలు విభాగాల అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక తదితరులతో ఈఓ సమావేశాన్ని నిర్వహించారు. వివిధ అంశాలపై సమీక్షించిన ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కార్తీకమాసంలో ప్రతి సోమవారం, కార్తీక పౌర్ణమిన జరిగే లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, జ్వాలాతోరణం, 31న జరిగే కృష్ణమ్మ హారతి, నవంబర్ 14న జరిగే కోటి దీపోత్సవం, 18న జరిగే తెప్పోత్సవం ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ కార్తీకమాసమంతా తెల్లవారుజామున 4.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయన్నారు.