
అద్దె పెంచి యజమానులను ఆదుకోవాలి
ప్రస్తుతం ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ యజమానులకు భారంగా మారింది. సీ్త్ర శక్తి పథకం అమల్లోకి వచ్చాక బస్సులు నడపడం ఇబ్బందిగా మారింది. ప్రయాణికులపట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నా కొన్ని చోట్ల డ్రైవర్లపై దాడులు జరుగుతున్నాయి. దీనికి తోడు డీజిల్ మైలేజి షార్టేజీ వస్తుండటంతో యజమానులు నష్టాలు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఆర్టీసీ చెల్లిస్తున్న అద్దె బస్సుల నిర్వహణకే సరిపోతున్నాయి. అద్దె పెంచి యజమానులను అన్ని విధాలా ఆదుకోవాలి.
– సుధాకర్, సీఐటీయూ జిల్లా నాయకుడు